BalaKrishna : రేయ్ అల్లు శిరీష్‌… నా చైర్‌కే ఎస‌రు పెట్టాల‌ని చూశావు క‌దా.. బాల‌కృష్ణ పైర్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

BalaKrishna : రేయ్ అల్లు శిరీష్‌… నా చైర్‌కే ఎస‌రు పెట్టాల‌ని చూశావు క‌దా.. బాల‌కృష్ణ పైర్..!

 Authored By sandeep | The Telugu News | Updated on :31 October 2022,11:40 am

BalaKrishna :  ఇటీవ‌ల బాల‌కృష్ణ .. అల్లు ఫ్యామిలీకి చాలా ద‌గ్గ‌ర‌య్యాడు.అన్‌స్టాప‌బుల్ షో నుండి బాల‌య్య అల్లు ఫ్యామిలీ వేడుక‌ల‌లో తెగ సంద‌డి చేస్తున్నాడు. అల్లు శిరీష్ హీరోగా నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా, నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో గ్రాండ్ గా జరిగింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చారు. మొదట నందమూరి అభిమానులకు, అల్లు అభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు ఈ కార్యక్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గీతా ఆర్ట్స్ ను 1974లో స్థాపించారు .. ఆ ఏడాదిలోనే నేను సినిమాల్లోకి వచ్చాను .. అప్పుడు నాకు 14 ఏళ్లు.

అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ సంస్థను నిలబెడుతూ రావడం అంత తేలికైన విషయమేం కాదు. ముందు నుంచి కూడా అల్లు కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఇప్పుడొస్తున్న కొత్త దర్శకులంతా కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. అలా వచ్చిన సినిమానే ఇది. ఈ సినిమా ట్రైల‌ర్ చూశాను. శిరీష్ బయటకూడా ఇంతేనా అనిపించింది. ఇక లాభం లేదు .. ఇతన్ని ‘అన్ స్టాపబుల్’ షోకి పిలిచి అన్ని విషయాలను బయటికి లాగుతాను. అనూ ఇమ్మాన్యుయేల్ చాలా అందంగా కనిపిస్తోంది. నటన కూడా బాగా చేసిందని తెలుస్తూనే ఉంది. అల్లు అరవింద్ తనకు, తన కుటుంబానికి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు బాల‌కృష్ణ‌.

BalaKrishna funny comments on Allu Shirish

BalaKrishna funny comments on Allu Shirish

BalaKrishna : స‌ర‌దా వ్యాఖ్య‌లు..

మా కాంబినేషన్ లో వచ్చిన టాక్ షో ఎంత గొప్ప హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అల్లు శిరీష్ గురించి చాలా మంది చెబితే విన్నాను. అతడు నా కుర్చీకే ఎసరు పెట్టే ప్రయత్నం చేశాడని అన్ స్టాపబుల్ షోని ఉద్దేశించి అన్నారు. ఈ విష‌యం చెప్ప‌డంతో ప్ర‌తి ఒక్కరు తెగ న‌వ్వేశారు. నా విషయానికి వస్తే నా అభిమానూలు కోరుకునే పాత్రలను చేస్తూ వెళతాను. వాళ్ల ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఏ సినిమా చేయనని అన్నారు. వాళ్లపై బలవంతంగా నా ఇష్టాలను రుద్దాలనుకోనని బాల‌య్య చెప్పుకొచ్చారు. మొత్తానికి బాల‌య్య స్పీచ్ అందరిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

YouTube video

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది