Home » Entertainment » Balakrishna Greatness About His Remuneration And His Producers
Entertainment

Balakrishna : బాలకృష్ణ నిజంగా గ్రేట్‌.. ఆ సినిమాలకు పారితోషికం కూడా తీసుకోలేదట!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: February 15, 2023, 10:00 am
Advertisement

Balakrishna : నందమూరి బాలకృష్ణ గురించి ఇండస్ట్రీలో రకరకాలుగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువ శాతం మంది బాలకృష్ణ ను భోళా అంటూ ఉంటారు. భోళా అంటే ఎవరు ఏది చెప్తే అది నమ్మేస్తాడు, కాస్త పొగడ్తల వర్షం కురిపిస్తే ఏం చేసేందుకైనా సిద్ధమంటాడు. అలా ఆయనతో ఎంతో మంది నిర్మాతలు మరియు దర్శకులు పొగడ్తలు కురిపించి వర్క్ చేయించుకున్నారు. ఆ మధ్య టాలీవుడ్ కి చెందిన ఒక నిర్మాత బాలకృష్ణ కు కనీసం రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ కూడా ఇవ్వకుండా ఏకంగా ఒక సినిమా చేయించుకున్నాడు. బాలయ్య మార్కెట్ విలువ 20 నుండి 30 కోట్ల రూపాయలు ఉన్న సమయంలో రెండు కోట్ల రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా సినిమా చేయడం

Advertisement

Balakrishna greatness about his remuneration and his producers

అంటే మామూలు విషయం కాదు. తనను అభిమానిస్తున్నాడని చిన్న ఉద్దేశంతో తక్కువ రెమ్యూనరేషన్ కి సినిమాలను చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక బాలకృష్ణ కొన్ని సినిమాలకు తీసుకున్న తక్కువ రెమ్యూనరేషన్ కూడా వెనక్కు ఇచ్చేశాడట.. కొన్ని సందర్భాల్లో సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడం, దాంతో నిర్మాతలు నష్టాల బారిన పడడం.. డిస్ట్రిబ్యూటర్స్ కోలుకోలేని దెబ్బ తినడం జరుగుతుంది. అలాంటి సమయంలో బాలకృష్ణ తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇవ్వడం చేశాడట. కొంత మంది నిర్మాతలు నష్టాలు రాకున్నా కూడా నష్టాలు చూపించి బాలకృష్ణకి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టారు అంటూ ఇండస్ట్రీలో టాక్ ఉంది.

Advertisement

Balakrishna greatness about his remuneration and his producers

రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు పట్టింపు లేని హీరో ఎవరైనా ఉంటారా అంటే అది కేవలం బాలకృష్ణ మాత్రమే అని ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు. సినిమా కమిట్ అయ్యే సమయంలో రెమ్యూనరేషన్ గురించి బాలకృష్ణ అస్సలు పట్టించుకోడు అనేది ఆయనతో సినిమాలు చేసిన దర్శక నిర్మాతల యొక్క మాట. అదే అదునుగా చేసుకొని చాలా మంది నిర్మాతలు ఆయనను మోసం చేస్తూ ఉంటారు. కొంత మంది నమ్మించి తక్కువ వసూళ్లు వచ్చాయని రెమ్యూనరేషన్ ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు. వారిని కూడా బాలకృష్ణ ఏమనకుండా క్షమించేస్తున్నాడు. అందుకే బాలకృష్ణ గ్రేట్ కదా.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి