Balakrishna Jr NTR : ఒకే వేదిక మీద బాబాయ్ అబ్బాయ్.. డాకు మహారాజ్ కోసం ఎన్టీఆర్ గెస్ట్..?
ప్రధానాంశాలు:
Balakrishna Jr NTR : ఒకే వేదిక మీద బాబాయ్ అబ్బాయ్.. డాకు మహారాజ్ కోసం ఎన్టీఆర్ గెస్ట్..?
Balakrishna Jr NTR : నందమూరి హీరోలు బాలకృష్ణ, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరిగింది అన్నది అందరు చెప్పుకుంటున్న వార్తే. ఈమధ్య ఎక్కడ బాబాయ్ అబ్బాయ్ కలిసినట్టు లేదు. అంతేకాదు ఎన్ టీ ఆర్ శతజయంతి ఉత్సవాల్లో కూడా తారక్ అటెండ్ అవ్వలేదు. ఈ వ్యవహారాలన్నీ ఎన్ టీ ఆర్ ఆ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు అన్న మాటకే బలాన్ని చేకూరుస్తున్నాయి. ఫ్యాన్స్ మధ్య కూడా ఈమధ్య చిన్నపాటి వైరం మొదలైంది. ఇదిలాఉంటే వీటన్నిటినీ తుడిచేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. బాలకృష్ణ లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సినిమా సంక్రాంతికి వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్ టీ ఆర్ ని తీసుకొచ్చే ప్లాన్ జరుగుతుంది. బాలకృష్ణ పిలిస్తే చాలు తారక్ వచ్చేస్తాడు. ఐతే బాలకృష్ణ ఎన్ టీ ఆర్ ఆహ్వానానికి ఓకే అంటాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
Balakrishna Jr NTR ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలిసి పోయే..
ఎలాగు కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా నెక్స్ట్ ఇయర్ ఉంది కాబట్టి బాలయ్య అన్న కొడుకులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లతో కలిసి పోయే ఛాన్స్ ఉంది. వాళ్లు వాళ్లు కలిసి ఉన్నా కూడా మీడియా వాళ్లని విడగొట్టేస్తుంది. ఐతే మేమంతా ఒక్కటే అని చాటి చెప్పేలా మరోసారి బాలయ్య, తారక్ ఒకే వేదిక పంచుకోవాలి. అది డాకు మహారాజ్ ఈవెంట్ అవుతుందని అంటున్నారు.
నందమూరి ఫ్యాన్స్ కూడా ఈ విషయంపై కాస్త అటు ఇటుగా ఉన్నారు. ఇక డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే కె ఎస్ బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సితార బ్యానర్ లో నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా హీరోయిన్స్ గా నటించారు. బాలకృష్ణ డాకు మహారాజ్ ఈవెంట్ కి ఎన్ టీ ఆర్ వస్తాడా రాడా.. వస్తే మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియచేయండి.. Balakrishna, Jr