Balakrishna : బాలయ్య ఈ నయా విప్లవం.. ఎవరికొరకు.. ఎంతవరకు అంటే.. ఇక్కడ స్విచ్ వేస్తే అక్కడ బల్బ్ వెలిగింది..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 28, 2022, 10:00 pm

Balakrishna : ప్రస్తుతం టాలీవుడ్ లో వీర ఫాం లో ఉన్నది ఎవరంటే అది మన వీర సిం హా రెడ్డి అదేనండి మన నందమూరి బాలకృష్ణ అని చెప్పొచ్చు. ఓ పక్క సినిమాలతో బాక్సాఫీస్ ని షేక్ చేఏస్తున్న ఆయన మరోపక్క కెరియర్ లో కొత్తగా హోస్ట్ గా చేస్తూ మెప్పిస్తున్నారు. అన్ స్టాపబుల్ షోతో బాలయ్య క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పొచ్చు. ఇన్నాళ్లు తమకు తెలిసిన బాలక్ర్ష్ణ ఒకరైతే అన్ స్టాపబుల్ షోతో మరొక సైడ్ తెలిసిందని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక డిజిటల్ స్ట్రీమింగ్ లో ఏ షో కూడా అన్ స్టాపబుల్ రేంజ్ లో హిట్ కాలేదు.

అందుకే అదే జోష్ తో అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా చేస్తున్నారు. ఇక ఇదిలాఉంటే ఇప్పుడు లేటెస్ట్ గా వాణిజ్య ప్రకటనలకు సై అనేశాడు. ఈమధ్యనే శ్రీ ప్రియ కన్ స్ట్రక్షన్ కోసం ఓ యాడ్ చేశాడు బాలయ్య. ఏదైనా తాను రంగంలోకి దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అనే డైలాగ్ లానే యాడ్స్ లో కూడా బాలయ్య వీరంగం ఆడేయడం ఖాయం. ఒకప్పుడు మూస సినిమాలు చేస్తూ కేవలం తనకున్న సీనియర్ స్టార్ ఇమేజ్ ని మాత్రమే కొనసాగించిన బాలయ్య వరుస ఫ్లాపులు తీస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే పంథా మార్చాడో అప్పుడు సినిమాల ఫలితాలు కూడా మారాయి. బాలయ్య ఈ కొత్త ఉత్సాహం నందమూరి ఫ్యాన్స్ ని అలరిస్తుంది.

balakrishna new change silver and small screen ads reasons

balakrishna new change silver and small screen ads reasons

అయితే ఇదంతా దేనికోసమని అందరు ఆలోచిస్తున్నారు. బాగా దీర్ఘంగా ఆలోచిస్తే నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి టైం వస్తున్న సందర్భంగా బాలకృష్ణ ఏ మీడియాన్ని వదలడం లేదని అర్ధమవుతుంది. అందుకే ఇన్నాళ్లు సిల్వర్ స్క్రీన్ మీద ఉన్న ఆయన ఈమధ్యనే డిజిటల్ స్క్రీన్ మీద కూడా రఫ్ ఆడిస్తున్నాడు. ఇక ఇప్పుడు యాడ్స్ తో కూడా తన సత్తా చాటుతున్నాడు. ఫైనల్ గా మోక్షజ్ఞ ఎంట్రీ కోసమే బాలయ్య ఇన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని. ఇది ఓ రకంగా మోక్షజ్ఞా కెరియర్ కి హెల్ప్ అవుతుందని అంటున్నారు. మరి బాలయ్య నిజంగానే వారసుడి కోసమే ఇదంతా చేస్తున్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp