Home » Entertainment » Balakrishna Sreeleela News
Entertainment

Balakrishna : నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని అడిగేసిన బాలకృష్ణ.. శ్రీలీల రియాక్షన్ ఇదే ..

Authored By
aruna
The Telugu News | Updated on: October 9, 2023 9:00 pm
Advertisement

Balakrishna : నటసింహం బాలయ్య వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోల కన్నా ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంటున్నారు. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ భగవంత్ కేసరి ‘ అనే సినిమాలో నటించారు. కాజల్, శ్రీ లీల ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం వరంగల్ లో జరిగింది. ఈ క్రమంలోనే బాలయ్య శ్రీ లీలను ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో శ్రీ లీల తనని చిచ్చా చిచ్చా అంటూ పిలుస్తూ నన్ను టార్చర్ పెట్టింది అని సరదాగా అన్నారు. నా తదుపరి సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల ను తీసుకోవాలనుకున్నా, అదే విషయాన్ని మా ఇంట్లో చెప్పా, ఆ మాట విని మా అబ్బాయి మోక్షజ్ఞ కోప్పడ్డాడు.

Advertisement

నేను హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాను యంగ్ హీరోని. నువ్వేమో ఆమెకు ఆఫర్ ఇస్తా అని అంటున్నావు అని కోపడ్డాడు అని మోక్షజ్ఞ గురించి బాలయ్య సరదాగా చెప్పారు. శ్రీ లీల గొప్ప నటి అని ఆమెకు మంచి భవిష్యత్తు ఉంది అని అన్నారు. ఇదే కార్యక్రమంలో శ్రీ లీలా మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. భగవంత్ కేసరి సినిమాలో తాను పోషించిన విజ్జి పాప పాత్ర తన మనసుకు చేరువైంది అని అన్నారు. విజ్జి పాప పాత్ర కోసం నన్ను సెలెక్ట్ చేసినందుకు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి థాంక్స్ చెప్పాలి. ఎన్ని పాత్రల్లో నటించిన మనకు కొన్ని పాత్రలు మాత్రమే మనసుకు దగ్గరవుతాయి.

Balakrishna Sreeleela news

Advertisement

అలా నాకెంతో చేరువైన పాత్ర ఇది. కథ విన్నప్పుడు నాకు ఎంతో ఎమోషనల్ గా అనిపించింది. మా లైఫ్ లో చూడని కొన్ని అనుభూతులను ఈ సినిమా నాకు అందించింది. కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఆ షార్ట్ అయిపోయిన తర్వాత కూడా నేను అదే పాత్రలో ఉండిపోయే దాన్ని. ఇది గొప్ప కథ. ఇందులో అందమైన సందేశం ఉంది. ఈ సినిమాలో భాగం కావటం నా అదృష్టమని శ్రీ లీల చెప్పుకొచ్చారు. ప్రస్తుత సోషల్ మీడియా బాలకృష్ణ స్త్రీల గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ హిట్టు ను అందుకుంటారేమో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి