Balakrishna : వైసీపీ ఎమ్మెల్యేకు వార్నింగ్ మూడో కన్ను తెరిస్తే వేరేలా ఉంటుంది బాలకృష్ణ వీడియో వైరల్..!!

Advertisement

Balakrishna : ఇటీవల గుంటూరు జిల్లా తెనాలిలోని పెమ్మసానీ థియేటర్ లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కార మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన బాలకృష్ణ సావిత్రి కుమార్తె చాముండేశ్వరి, నిర్మాత నాగిరెడ్డి కుమారుడు విశ్వనాథరెడ్డికి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ… సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Balakrishna Strong Counter To YSRCP MLA Gopireddy Srinivasa Reddy
Balakrishna Strong Counter To YSRCP MLA Gopireddy Srinivasa Reddy

ముఖ్యంగా నరసరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికీ పేరు ప్రస్తావించకుండానే వార్నింగ్ ఇచ్చారు. రాజకీయాలకు సినిమాలను ముడిపెట్టొద్దు.. నరసరావుపేటలో నా పాట వేశారని ఓ కార్యకర్తను వైసీపీ ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారు.. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఊరుకోను.. సినిమాను సినిమాలాగా చూడాలి. నరసారావు పేట లో జరిగిన వేడుకల్లో బాలకృష్ణ సినిమా పాటలకు వైసీపీ కార్యకర్తలు డాన్స్ వేయద్దని నిర్వాహకులకు వైసీపీ ఎమ్మెల్యే..

Advertisement

Andhra Pradesh: హీరో బాలయ్యకు కౌంటరిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.. 'నా ఇలాకాలో మీ  ఇన్వాల్వ్‌మెంట్‌ ఏంటి?' అంటూ.. | Narasaraopet YCP MLA Gopireddy Srinivasa  Reddy Counter To Nandamuri ...

వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతటితో ఆగకుండా కార్యకర్తపై చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాలయ్య బాబు గుంటూరు తెనాలి ఎన్టీఆర్ శతాబ్ది కార్యక్రమంలో తీవ్రంగా స్పందించారు. రాజకీయాలకు సినిమాలకు ముడి పెట్టకూడదని అన్నారు. సినిమాను సినిమా లాగా చూడాలి. సినిమాలు అన్ని పార్టీల వారు చూస్తారు. అందరూ సినిమాలు చూస్తారు. ఇంకోసారి.. ఇటువంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేకు బాలకృష్ణ ఇచ్చిన వార్నింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Advertisement