Balakrishna want to Nayanthara in his movie
Balakrishna : టాలీవుడ్ లో నటసింహం బాలయ్య నయనతార కాంబినేషన్ గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో స్క్రీన్ పై ఈ జంటను చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. వీరిద్దరూ కలిసి గతంలో సింహం, శ్రీరామరాజ్యం, జై సింహా లాంటి హిట్లు కొట్టారు. అయితే తాజాగా మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ భగవంత్ కేసరి ‘ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే బాలయ్య తరువాతి సినిమాని వీలైనంత త్వరగా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే హీరోయిన్ గా నయనతారని ఎంపిక చేశారని తెలుస్తుంది. అందుకు నయనతారను కూడా సంప్రదించినట్లు తెలిసింది ఆమె కూడా దీనికి ఓకే చెప్పింది. నయన్ బిజీ షెడ్యూల్ కారణంగా డేట్లు కేటాయించలేదట. అందుకు కాస్త సమయం కావాలని అడిగిందట. ప్రస్తుతం నయనతార చాలా సినిమాలు చేస్తుంది. కేవలం తెలుగులోనే కాదు కోలీవుడ్లో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది.
Balakrishna want to Nayanthara in his movie
ఇంకా ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయని సమాచారం. నయన్ కేవలం టాలీవుడ్ కోలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతుంది. షారుక్ ఖాన్ నటిస్తున జవాన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటుంది. దీని కారణంగానే బాలయ్య సినిమాలకు ఎక్కువ డేట్లు కేటాయించలేక పోతుంది. ఈ సినిమా పూర్తి అయ్యాక బాలయ్య సినిమాకి డేట్లు కేటాయించే అవకాశం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఎలాంటి టాక్ ఇస్తుందో చూడాలి. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయితే వీరిద్దరి కాంబినేషన్ కి మరింత క్రేజ్ వస్తుంది.
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
This website uses cookies.