Balakrishna : బాలకృష్ణ ఫ్యాన్స్ కు త్రిబుల్ ధమాకా .. ” వీర సింహారెడ్డి లో మూడు పాత్రలు చేయనున్న బాలయ్య ..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 22, 2022, 5:40 pm

Balakrishna : నందమూరి బాలయ్య గతేడాది ‘ అఖండ ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకునే ప్రయత్నంలో ఉన్నాడు బాలయ్య. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతికి బాలయ్య సినిమాలతో పాటు తమిళ్ హీరో విజయ్ ‘ వారసుడు ‘ , అజిత్ ‘ తెగింపు ‘ సినిమాలు బరిలోకి దిగనున్నాయి. ఈ సినిమాలకు పోటీగా బాలయ్య వీర సింహారెడ్డి సినిమా భారీ రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

అయితే ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలు చేస్తున్నాడు అనే వార్త వచ్చింది. అందులో ఒకటి రాయలసీమలో ఉండే వీరసింహారెడ్డి పాత్ర ఒకటి, అమెరికా నుంచి వచ్చే బాల సింహరెడ్డి పాత్ర మరొకటి. అయితే తాజాగా బాలయ్య మూడు పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మూడో పాత్రను మూవీ మేకర్స్ సస్పెన్స్ గా ఉంచినట్లు తెలుస్తుంది. అది సినిమా చూస్తున్నప్పుడు మాత్రమే తెలిసేలా దానిని సీక్రెట్ గా ఉంచారట.

Balakrishna will play three roles in Veera Simha Reddy Movie

Balakrishna will play three roles in Veera Simha Reddy Movie

ఇక వీర సింహారెడ్డి సినిమా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. బాలయ్య కు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్, కన్నడ నటుడు దునియా విజయ్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇక ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమాలో రెండు పాటలు విడుదల కాగా మూడో పాట విడుదల కావటానికి సిద్ధంగా ఉంది. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య మూడు పాత్రలు చేస్తున్నాడో లేదో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. మూడు పాత్రలు కనుక చేస్తే ఫ్యాన్స్ కి త్రిబుల్ ధమాకా అని చెప్పవచ్చు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp