
Balayya Chiranjeevi multistarrer movie
Balakrishna : తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు ఇటీవల కాలంలో చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఒకే హీరో మూడు నుంచి నాలుగు పాత్రలు సులువుగా పోషించిన రోజులున్నాయి. అయితే, NTR, ANR హయాంలో మాత్రం చాలా సినిమాల్లో ఈ అగ్రనటులు ఇద్దరు కలిసి వెండితెరపై మెరిసారు. అభిమానులు ఒప్పించి మరీ మెప్పించారు. బాక్సాఫీసులు బద్దలు కొట్టారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో అగ్రహీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారు ఒకే సినిమాలో ఇంతవరకు కనిపించలేదు. వీరికి తెలుగు రాష్ట్రాల్లో మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండదు. వీరిద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే అభిమానులకు పండగే అని చెప్పుకోవచ్చు.
కానీ ఇంతవరకు మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలిసి సినిమాలు చేయలేదు.ఆర్ఆర్ఆర్ సినిమాతో దర్శకుడు రాజమౌళి నందమూరి, మెగాస్టార్ అభిమానులకు ఒకేసారి కిక్కిచ్చేందుకు సిద్దమయ్యారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి వెండి తెరపై కనిపించనున్నారు. అది కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో.. కుర్ర హీరోలు ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు సరే.. మరి బాలయ్య, చిరంజీవి ఎప్పుడు వెండితెరపై కలిసి నటిస్తారని చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అదే గనుక జరిగితే ఇప్పటివరకు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్ని తుడిచిపెట్టుకోవడం ఖాయమని ఫిలిం వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కూడా కీలక ప్రకటన చేసింది
Balayya Chiranjeevi multistarrer movie
మెగాస్టార్ ఫ్యామిలీకి, అటు నందమూరి ఫ్యామిలీ మాస్ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఎక్కువే. వీరిద్దరితో కలిసి సినిమా చేసేందుకు తాము సిద్ధమని, అందుకు మంచి కథ దొరికితే ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తామని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ ఒక్క మాటతో నందమూరి, మెగా ఫ్యాన్స్‌కు ఆశలు చిగురించాయి. నిజంగా చిరు, బాలయ్య వెండి తెరను పంచుకుంటే బాక్సాఫీస్ బద్దలు అవ్వక తప్పదని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. అయితే, కథ విషయంలో మాత్రం ఇద్దరు హీరోలకు ఎక్కడా తక్కువ చేసి చూపించకుండా సినిమా తీయడం అంటే దర్శకులకు అగ్నిపరీక్షే.. ఎందుకంటే ఫ్యాన్స్ మధ్యలో మరో కొత్త యుద్ధం మొదలవుతుందని దర్శకులు కూడా భయపడుతున్నారట.. బాలయ్య చిరు కలిసి నటిస్తే అభిమానులు మాత్రం కాలర్ ఏగరేయడం మాత్రం ఖాయం..
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.