Balayya Son Mokshagna : టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్టీఆర్ లెగసీను బాలయ్య నిలబెట్టారు. దాన్ని జూనియర్ ఎన్టీఆర్ మరింత ముందుకు తీసుకెళ్లారు. అయితే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. చాలాకాలంగా మోక్షజ్ఞ హీరో అవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అందుకే మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు ప్రతిసారి ఘనంగా చేస్తున్నారు. అభిమాన సంఘాలు నిర్వహించే జన్మదిన వేడుకల్లో మోక్షజ్ఞ పాల్గొనడం జరిగింది. కానీ నటుడిగా మోక్షజ్ఞ ఇంతవరకు ఎంట్రీ ఇవ్వలేదు. ప్రస్తుతం మోక్షజ్ఞ మూడు పదుల వయసుకు దగ్గర అవుతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ 17 ఏళ్లకే హీరో అయ్యాడు. 35 ఏళ్లకే గ్లోబల్ స్టార్ గా మారాడు.
మోక్షజ్ఞ హీరోగా మారి పదేళ్లు దాటి పోవాల్సింది. కానీ ఇంతవరకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వలేదు. మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చి ఉంటే ఇప్పుడు స్టార్ ఇమేజ్ ను తెచ్చుకునేవారు. నందమూరి ఫ్యామిలీ అమితంగా ప్రేమించే వాళ్ళందరూ మోక్షజ్ఞ హీరో కావాల్సిందే అంటున్నారు. ఇక బాలయ్యను ఇదే ప్రశ్న చాలాసార్లు అడగడం జరిగింది. ఆయన ప్రతిసారి ఈ ఏడాది మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కచ్చితంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇవ్వలేదు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞకు నటనపై ఆసక్తి లేదని అంటున్నారు. బిజినెస్ చేసుకుంటానని మోక్షజ్ఞ తేల్చి చెప్పేశాడట. బాలయ్య మాత్రం పట్టుబట్టి మోక్షజ్ఞను హీరో చేయాలని అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే ఒక న్యూస్ బయటకు వచ్చింది.
మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ స్పందించారు. మోక్షజ్ఞ నాకు మంచి ఫ్రెండ్. అతడు త్వరలోనే హీరో అవుతాడు. దానికోసం అంత సిద్ధం చేసుకుంటున్నారు. నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. మోక్షజ్ఞ నేను కలిసి ధియేటర్లలో సినిమాలు కూడా చూసాం. అలాగే మోక్షజ్ఞ మంచి నటుడు. అతడు కనుబొమ్మలతోనే నటించగలడు. నందమూరి ఫ్యామిలీ నుండి మరో మంచి హీరో అవుతాడు అని చెప్పుకొచ్చాడు. దీంతో నందమూరి అభిమానుల్లో బెల్లంకొండ గణేష్ ఇచ్చిన అప్డేట్ ఉత్సాహం నింపింది. మోక్షజ్ఞ త్వరగా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని స్టార్ హీరో అవ్వాలని కోరుతున్నారు.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.