Bandla Ganesh : ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో బండ్ల గ‌ణేష్‌కి చెడిందా.. ఆయ‌నతో సినిమాలు చేయ‌నంటున్న బండ్ల‌

Authored By Sam C | The Telugu News | Published on: May 2, 2022, 3:30 pm

Bandla Ganesh : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఆయ‌న అభిమానులు ఎంత‌గా అభిమానిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు వీరాభిమానులు చాలా మందే ఉన్నారు. ప‌వ‌న్‌ని ప్రాణం క‌న్నా ఎక్కువ ప్రేమిస్తుంటారు.ఇక నిర్మాతగా, కమెడియన్‌గా కన్నా పవన్ కల్యాణ్ వీర భక్తుడిగా ఎక్కువ పేరు తెచ్చుకున్న బండ్ల గణేశ్ అయితే ఎక్కువ‌గా ప‌వ‌న్ జప‌మే చేస్తుంటాడు. రీసెంట్ ఇంట‌ర్వ్యూలో బండ్ల గ‌ణేష్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా విష‌యంపై స్పందించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న మాట్లాడిన తీరు షాకింగ్‌గా అనిపించాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నానంటూ బండ్ల గ‌ణేష్ చెప్పిన తీరు విస్మ‌యప‌రిచింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమాలు చేస్తుండ‌గా, ఆయ‌న‌తో బండ్ల గ‌ణేష్ సినిమా ఉంటుంద‌ని కొన్నాళ్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో స్పందించారు. భ‌విష్య‌త్తులో హండ్రెడ్ ప‌ర్సెంట్ సినిమాలు తీస్తాను. సినిమానే నాకిష్టం, సినిమానే నా ప్రాణం. సినిమాలే నా మోష‌న్ కాబ‌ట్టి సినిమాలు తీస్తా.. తీస్తా. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌గారితో సినిమా చేయ‌కూడ‌ద‌ని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయ‌న త్వ‌ర‌గా ముఖ్య‌మంత్రి అయిపోవాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. ఒక‌వేళ ప‌వ‌న్‌తో సినిమా ఛాన్స్ వ‌స్తే త‌ప్ప‌క చేస్తాన‌ని చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం తాను రాజకీయాల్లో లేనని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. గతంలో తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాట వాస్తవమే అని..

Bandla Ganesh Comments on Pawan Kalyan

Bandla Ganesh Comments on Pawan Kalyan

Bandla Ganesh : అస‌లు విష‌యం ఇది..

కానీ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని తేల్చి చెప్పారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం తనకు బాధ కలిగించిందన్నారు. తనకు ప్రతి పార్టీలో స్నేహితులు ఉన్నారని.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీలో రంజిత్‌రెడ్డి తనకు మంచి స్నేహితులు అని.. స్నేహానికి, రాజకీయానికి సంబంధం లేదని బండ్ల గణేష్ అన్నారు.టీవలే పక్క రాష్ట్రాల గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట్లాడినప్పుడు.. ఏపీలోని వైసీపీ మంత్రులు ఎందుకు స్పందించారో తనకు అర్థం కాలేదని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. గుమ్మడికాయల దొంగ ఎవరంటే వైసీపీ వాళ్లు భుజాలు ఎందుకు తడుముకున్నారని ప్రశ్నించారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp