Sai dharam tej: మెగా మేనల్లుడు సినీ హీరో సాయి ధరమ్ తేజ్ గత రాత్రి ప్రమాదవశాత్తు బైక్ మీద వెళుతూ జారిపడిన విషయం తెల్సిందే. తీవ్ర గాయాలైన ఆయనను దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకు వెళ్లి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం అపోలో ఆసుపత్రికి తరలించారు. నిన్నటి నుంచి మెగా ఫ్యామిలీ తో పాటు సినీ ప్రముఖులు సాయి ధరం తేజ్‌ని పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నటుడు, మా అధ్యక్షుడు వీకే నరేశ్ స్పందించారు. సాయితేజ్ గురించి మాట్లాడుతూ ఒక వీడియోను ఈరోజు ఉదయం విడుదల చేశారు.
ఈ వీడియోలో నరేశ్ మాట్లాడుతూ..‘సాయి తేజ్, మా అబ్బాయి నవీన్ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. నిన్న సాయంత్రం మా ఇంటినుంచే బయలుదేరి వెళ్ళారు. నేను ఆ బైక్ సౌండ్స్ విని వెళ్ళేలోపే బయల్దేరిపోయారు. బైక్ రైడింగ్ చేయొద్దని సాయి తేజ్ కి నేను చాలా సార్లు హెచ్చరించాను. నేను ఎంత చెప్పినా నా మాటలు పట్టించుకోలేదు. తేజ్, మా అబ్బాయి కలిసి రైడింగ్ చేస్తుంటారు. ఈ విషయంలో ఇంతక ముందే వీరిద్దర్నీ గట్టిగా హెచ్చరించాను. తేజ్.. నా బిడ్డలాంటి వాడు. తను త్వరగా కోలుకొని మళ్ళీ షూటింగులకి హాజరవుతాడని ఆ భగవంతుణ్ణి, మా అమ్మను కూడా ప్రార్ధిస్తున్నాను.
నాలుగు రోజుల క్రితం కూడా వీరికి కౌన్సిలింగ్ ఇవ్వాలని అనుకున్నాను. ఇద్దరూ మంచి వయసులో ఉన్నారు. పెళ్ళి చేసుకోవాల్సిన వాళ్ళు.. మంచి కెరీర్ ఉన్నవాళ్ళు. ఇలాంటి సమయంలో రిస్క్ చేయడం మంచిది కాదు. సాయిని చూడటానికి ఆసుపత్రికి వద్దామనుకున్నాను. కానీ అక్కడ ఐసీయూలో ఉన్నప్పుడు వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎందుకని రాలేదు. త్వరలో సాయి ధరమ్ తేజ్‌ని కలుసుకుంటాను.. అని నరేష్ తెలిపారు.
అయితే దీనిలో ఆయన మాట్లాడిన బైక్ రైడింగ్ గురించి సినీ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ సీరియస్ అయ్యాడు. ఇలాంటి సమయంలో బైక్ రేస్‌ల గురించి మాట్లాడటం సరికాదన్నారు. అంతేకాదు తాజాగా సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. నరేశ్‌పై ఘాటుగా స్పందించారు. ‘సాయిధరమ్ తేజ్‌గారు షూటింగ్స్ చేస్తారు.. బ్రహ్మాండంగా ఉంటారు.. అద్భుతంగా ఉంటుంది. చిన్న ప్రమాదం జరిగింది అంతే. ఈ టైమ్‌లో నరేష్ గారు.. మీరు ఎవరెవరో ప్రమాదవశాత్తూ మరణించిన వారి పేర్లు చెప్పడం కానీ, మీరట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు.
ఇప్పుడెందుకు సార్. రేసింగ్ చేశాడు.. అని మీ ఇంటి దగ్గరకు వచ్చాడని చెప్పడం. ఇప్పుడెందుకు ఇవన్నీ చెప్పండి. తప్పు కదా సార్. ఇట్లాంటప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించి త్వరగా కోలుకోవాలి.. సాయిధరమ్ తేజ్ మనలో హ్యాపీగా ఉండాలని కోరుకోవాలి గానీ, ఇట్లాంటవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.
ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్. మీ అందరికీ చేతులెత్తి దణ్ణం పెడుతున్నాను. సాయిధరమ్ తేజ్, భగవంతుడి ఆశీస్సులతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బ్రహ్మాండంగా ఉంటుంది.. థ్యాంక్యూ.. అంటూ బండ్ల గణేష్ వీడియోలో మాట్లాడాడని పేర్కొన్నారు. ఇదే క్రమంలో సీనియర్ నటుడు శ్రీకాంత్ కూడా నరేశ్ మాటలను తప్పు పట్టారు. ఇలా టాలీవుడ్ ప్రముఖులు నరేశ్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కామెంట్ చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.