Bangarraju Movie Trailer : బంగార్రాజు ట్రైల‌ర్ విడుద‌ల‌.. అక్కినేని హీరోలు దుమ్మురేపేశారుగా..!

Authored By Sam C | The Telugu News | Updated on : 11 January 2022, 5:24 pm

Bangarraju Movie Trailer : అక్కినేని నాగార్జున ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య న‌టించిన తాజా చిత్రం బంగార్రాజు. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఈ సంక్రాంతికి థియేటర్స్‌లో సందడి చేయబోతోంది. కరోనా కారణంగా భారీ బడ్జెట్ సినిమాలు వాయిదాపడ్డా కూడా ధైర్యం చేసి బరిలోకి దిగుతున్నాడు బంగార్రాజు. జ‌న‌వ‌రి 14న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జరుగుతున్నాయి.కొద్ది సేప‌టి క్రితం చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో ఆక‌ట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా చైతూ, నాగ్ మ‌ధ్య స‌న్నివేశాలు అభిమానుల‌కి క‌నుల పండుగ‌గా ఉన్నాయి. ఇటీవలే సెన్సార్ పూర్తి చేస్తున్న బంగార్రాజు సినిమాకు U/A సర్టిఫికెట్ వచ్చింది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్‌లో బంగార్రాజు బావ‌గారు చూపుల‌తో ఊచ‌కోత కోసేస్తారు.. మాట్లాడుకోవ‌డానికి అయితే అమ్మాయిని, కొట్టేస్టుకోడానికి అయితే అబ్బాయిని తీసుకుర‌మ్మ‌ని చెప్పావ‌ట క‌దరా అనే డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. చైతూ గ‌తంలో ఎప్పుడు క‌నిపించ‌ని మాస్ లుక్‌లో క‌నిపించారు. ట్రైల‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలే పెంచింది.ఈ సినిమాకు ఊహించని ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 30 కోట్ల వరకు ప్రీ రిలీజ్ జరగొచ్చని అంతా భావించారు.

Bangarraju Movie Trailer released

Bangarraju Movie Trailer released

Bangarraju Movie Trailer : ట్రైల‌ర్‌లో చిత‌క్కొట్టిన అక్కినేని హీరోలు

కానీ దానికి ఇంకో 4 కోట్లు యాడ్ చేసుకొని 34 కోట్ల మేర రెండు తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.ఇందులో రమ్యకృష్ణ, కృతిశెట్టి మెయిన్‌ లీడ్స్‌ కాగా ఫరియా అబ్దుల్లా స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది. వీళ్లతో పాటు మీనాక్షి దీక్షిత్‌, దర్శన బానిక్‌, వేదిక, దక్ష నాగార్కర్‌, సిమ్రత్‌ కౌర్‌ వంటి హీరోయిన్లు కూడా కనిపించనున్నట్లు తెలుస్తుంది. గతంలో నాగార్జున నటించిన కింగ్‌ సినిమాలోని ఒక పాటలో ఏకంగా ఇండస్ట్రీలోని టాప్‌ హీరోయిన్స్‌ సందడి చేసిన సంగతి తెలిసిందే.

Also read

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp