BalaKrishna : బాలయ్య పేరు బాలకృష్ణకి ఎలా వచ్చిందో తెలుసా?
BalaKrishna : నందమూరి బాలకృష్ణ.. ఈ పేరు గురించి తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు బాలయ్య. ఆయన నటించిన పలు చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి. నటుడిగానే కాకుండా అన్‌స్టాపబుల్ షోతో హోస్ట్‌గా కూడా అదరగొట్టిన బాలకృష్ణ అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే ఇక బాలకృష్ణని ఆయన అభిమానులే కాదు, తెలుగు సినీ లవర్స్ కూడా చాలా ముద్దు పేర్లతో పిలుస్తుంటారు. యువరత్న , నందమూరి నటసింహం , బాక్సాఫీస్ బొనంజా, గోల్డెన్ స్టార్, బాలయ్య, లయన్ ఇలా చాలా పేర్లతో పిలుస్తుంటారు. ఆయన్ను ఎక్కువుగా బాలయ్య అని పిలిచేవాళ్లే ఉంటారు.
జై బాలయ్య అన్న నినాదం ఇటీవల కామన్ అయిపోయింది. అది బాలయ్య ఫంక్షనో, ఎన్టీఆర్ సినిమా ఫంక్షనో.. నందమూరి వాళ్ల ఫంక్షనో మాత్రమే కాదు.. ఏ హీరో ఫంక్షన్లో అయినా.. మరే హీరో సినిమా ఆడుతున్న థియేటర్లలో అయినా ఈ జై బాలయ్య నినాదం కామన్ అయిపోయింది. అఖండ లో అయితే ఏకంగా జై బాలయ్యా సాంగ్ పెట్టడం.. ఆ సాంగ్ ఆ సినిమా విజయంలో ఎంత హైలెట్ అయ్యిందో చూశాం. అసలు బాలకృష్ణకు బాలయ్య అన్న ముద్దు పేరు ఎలా వచ్చింది ? అంటే.. బాలయ్య – బి. గోపాల్ కాంబినేషన్ అంటేనే వెరీ ఇంట్రస్టింగ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్లో నాలుగు హిట్ సినిమాలు వచ్చాయి. లారీడ్రైవర్ ఆ తర్వాత రౌడీఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు సినిమాలు వచ్చాయి.

behind the reason for balakrishna as balayya
BalaKrishna : ఇది అసలు మేటర్..
లారీడ్రైవర్ సినిమా టైంలో జొన్నవిత్తుల పాట రాస్తున్నప్పుడు డైరెక్టర్ బి. గోపాల్ మీరు పాట ఏమైనా రాసుకోండి.. పాటలో మాత్రం బాలయ్య అన్న పదం వినిపించాలని చెప్పారట. వెంటనే జొన్నివిత్తుల బాలయ్య బాలయ్యా.. గుండెల్లో గోలయ్యా జో కొట్టాలయ్యా అని రాశారు. ఆ పాట సినిమాలో సూపర్ హిట్ అయిపోయింది. దాంతో బాలకృష్ణ బాలయ్యగా మారాడు. ఇక అప్పటి నుండి జై బాలయ్య అని అందరు ముద్దుగా పిలుచుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ కోవిడ్ నుంచి కోలుకున్నారు. రీసెంట్‌గా బాలకృష్ణకు కరోనా పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే అధికారికంగా ప్రకటించారు. డాక్టర్స్ సలహాలు తీసుకుంటూ ఆయన హోం ఐసోలేషన్ ఉన్నారు. రీసెంట్‌గా జరిపిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ రావటంతో బాలకృష్ణ కోలుకున్నారని డాక్టర్స్ తెలిపారు.