Home » Entertainment » Bellamkonda Sai Srinivas About Monal Gajjar
Entertainment

పరువు తీసాడా? గొప్పగా చెప్పాడా?.. మోనాల్‌పై బెల్లంకొండ కామెంట్స్

Authored By
Cinema Desk
The Telugu News | Published on: January 3, 2021, 9:20 pm
Advertisement

మోనాల్ గజ్జర్ ఇప్పుడు కాస్త లైమ్ లైట్‌లో ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ నాల్గో సీజన్ వల్ల మోనాల్‌కు పేరు వచ్చింది. అది మంచి పేరా? చెడ్డ పేరా? అన్నది పక్కన పెడితే.. మోనాల్ మాత్రం బాగానే పాపులర్ అయింది. వెంట వెంటనే ఆఫర్లు కూడా వచ్చేశాయి. అలా మోనాల్‌కు ఇప్పుడు స్టార్ మాలో డ్యాన్స్ ప్లస్ షోలో జడ్జ్‌గా ఆఫర్ వచ్చింది. అంతే కాకుండా బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ సినిమాలో ఓ ఆఫర్ వచ్చింది.

Advertisement

Bellamkonda Sai Srinivas about Monal Gajjar

అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం మోనాల్‌ను తీసుకున్నారు. దీని కోసం మోనాల్‌కు పదిహేను లక్షలు చెల్లించినట్టు సమాచారాం. అదంతా పక్కన పెట్టేస్తే.. తాజాగా బెల్లంకొండ ఈ విషయంపై స్పందించాడు. ఐటెం సాంగ్‌లో మోనాల్‌ను ఎందుకు తీసుకున్నారనే ప్రశ్నకు వెరైటీ సమాధానం చెప్పాడు. మామూలుగా ఈ సినిమాలో నాలుగు పాటలుంటాయి.. ప్రతీ ఒక్కటి వేర్వేరుగానే ఉంటాయని బెల్లకొండ చెప్పుకొచ్చాడు.

Advertisement

అయితే ఈ సినిమాను మొదటగా సమ్మర్‌లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాం. కానీ ఇప్పుడు పరిస్థితులు బాగానే ఉన్నాయి. అందుకే సంక్రాంతికే వద్దామని అనుకున్నాం. కానీ తక్కువ టైం ఉంది. అంతలోపే రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. మిగతా షూటింగ్ అయిపోయింది. అయితే అందులో ఒకటి ఐటెం సాంగ్. అయితే ఇప్పుడు మోనాల్‌కు బిగ్ బాస్ వల్ల క్రేజ్ ఉంది పీక్స్‌లో ఉంది కాబట్టి తీసుకున్నామని చెప్పాడు. అయితే ఇందులో టైం తక్కువగా ఉండటం వల్ల తీసుకున్నారా? లేదా బిగ్ బాస్ వల్ల వచ్చిన క్రేజ్ ద్వారా తీసుకున్నారో క్లారిటీగా చెప్పలేదు.

 

Cinema Desk

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి