Home » Entertainment » Big News For Mahesh Babu And Allu Arjun Fans
Entertainment

Mahesh Babu – Allu Arjun : మహేష్ బాబు, అల్లూ అర్జున్ ఫ్యాన్స్ అందరూ రెడీగా ఉన్నారా .. మీకొక బిగ్ న్యూస్ !

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: April 30, 2023 3:20 pm
Advertisement

Mahesh Babu – Allu Arjun : ఒకప్పుడు టాలీవుడ్ లో ఫ్యామిలీ సినిమాలు చేసిన జగపతిబాబు ప్రస్తుతం విలన్ గా మారి సినిమాలు చేస్తున్నాడు. అలాగే కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ వస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో విలన్ గా మారిన జగపతిబాబు ప్రస్తుతం వరుసగా విలన్ క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నాడు. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా విలన్ పాత్రలకు ఇతర భాషల ఆర్టిస్టులను తీసుకువచ్చేవారు. ఇప్పుడు కూడా కొన్ని సినిమాల్లో ఇతర భాషలకు ఇతర భాషల స్టార్స్ ను విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటింప చేస్తున్నారు.

Advertisement

Big news for Mahesh Babu and Allu Arjun fans

ఇలాంటి టైంలో జగపతిబాబు విలన్ పాత్రలు చేసి సత్తా చాటాడు. ఇప్పుడు తెలుగు స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువగా విలన్ గా జగపతిబాబు కనిపిస్తున్నాడు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషలలో కూడా జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడు. అయితే ప్రస్తుతం జగపతిబాబు అల్లు అర్జున్, మహేష్ బాబు సినిమాలలో విలన్ గా నటిస్తున్నాడు. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్ గా జగపతిబాబు కనిపించబోతున్నాడు. అంతకుముందు సుకుమార్ దర్శకత్వం రంగస్థలం సినిమాలో జగపతిబాబు విలన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement

పుష్ప 2 సినిమాతోపాటు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి 28 సినిమాలో కూడా జగపతిబాబు విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో తన పాత్ర కాస్త రగ్గడ్ లుక్ తో ఉంటుందని జగపతిబాబు పేర్కొన్నాడు. ఇటీవల జగపతిబాబు చేసిన పాత్రలకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. అందుకే ఈ సినిమాలో కూడా జగపతిబాబు పాత్ర బాగుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా మారి తన క్రేజ్ ను సంపాదించుకుంటున్నాడు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి