Nayanthara – Vignesh : కోలీవుడ్ జంట నయన్ విఘ్ణేష్ లు పెళ్లి చేసుకునప్పటి నుంచి ఏదో ఒక వివాదాల్లో ఉంటూనే ఉంటున్నారు. ప్రత్యేకంగా వారు ఇన్వాల్వ్ అవకపోయినా వారు చేసిన పనుల వల్ల గొడవలు జరుగుతున్నాయి. పెళ్లప్పుడే వీడియో రైట్స్ విషయంలో జరిగిన తతంగం తెలిసిందే. ఇక మరోపక్క ననయ్ సరోగసి విధానంలో పిల్లలను కనడం పెద్ద న్యూస్ అయ్యింది. నాలుగు నెలలకే నయనతార తల్లి అవడం అందరిని ఆశ్చర్యపరచింది. సరోగసి విధానం ఇండియాలో బ్యాన్ చేయబడ్డది. అలాంటిది నయన్ ఎలా సరోగసి ద్వారా పిల్లలు కంటుంది అని గొడవకి దిగారు.
ఈ విషయంపై తమిళనాడు ప్రభుత్వం కూడా నయన్, విఘ్నేష్ లపై చాలా సీరియస్ గా ఉంది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం నయన్ సరోగసి ద్వారా పిల్లలని కన్నది ఇండియాలో కాదట. దుబాయ్ లో అని తెలుస్తుంది. దుబాయ్ లో ఆ ప్రాసెస్ కి పర్మిషన్ ఉంది. అందుకే వారు అక్కడకు వెళ్లి సరోగసి ద్వారా బిడ్డలను కన్నట్టు తెలుస్తుంది. దీనితో వారు ఇక్కడ కాకుండా అక్కడ సరోగసి చేయించుకున్నారు కాబట్టి వారిపై ఎలాంటి కేసు ఉండబోదని తెలుస్తుంది. కోలీవుడ్ జంటకి ఈ న్యూస్ పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. ఇక దీపవళి సందర్భంగా నయంతార, విఘ్నేష్ తన పిల్లలతో స్పెషల్ విషెష్ అందించారు.
పెళ్లి తర్వాత కూడా నయన తార వరుస సినిమాలు చేస్తుంది. అమ్మడి క్రేజ్ పెళ్లితో ఆగిపోయేది కాదు. విఘ్నేశ్ శివన్ కూడా డైరక్టర్ గా తన సినిమాల ప్లానింగ్ లో ఉన్నాడు. ఫీమేల్ సెంట్రిక్ సినిమాలతో పాటుగా కమర్షియల్ సినిమాల్లో కూడా నయనతార నటిస్తుంది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా నయన్ వరుస ఛాన్సులు అందుకుంటుంది. చిరు గాడ్ ఫాదర్ లో కూడా ఆమె ఫ్యాన్స్ ని అలరించింది. తెలుగులో సీనియర్ హీరోలతో నయనతార జతకడుతుంది. ఇప్పటికే బాలయ్య, వెంకటేష్ లతో సినిమాలు చేసిన నయనతార చిరుతో సైరా, గాడ్ ఫాదర్ సినిమాల్లో నటించి మెప్పించింది.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.