
bigg boss 5 telugu priyanaka manas selected as best couple in latest episode
Bigg Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ తాజాగా 49వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయింది. ఇప్పటికే ఆరుగురు హౌజ్ నుంచి ఎలిమినేట్ కాగా ఏడో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కు బెస్ట్ మ్యాచెస్ వెతకండి అనే టాస్క్ ఇవ్వగా జోడీగా ప్రియాంక, మానస్‌లను జెస్సీ మినహా మిగతా కంటెస్టెంట్స్ అందరూ సెలక్ట్ చేశారు.ఇక బెస్ట్ కపుల్‌గా సెలక్ట్ అయిన ప్రియాంక, మానస్ ఇద్దరు సెలబ్రేషన్స్‌లో పాల్గొంటారు. పూల దండలు మార్చుకుని ఆనందంగా సెలబ్రేషన్స్ జరుగుతున్న సమయంలోనే యానీ మాస్టర్ ఎంటర్ అవుతుంది. ఇటువంటి ఆనంద తరుణంలో ఎంజాయ్ చేయాల్సింది పోయి అసలు టాస్క్ మరిచిపోతానేమోనని యానీ మాస్టర్ ఆందోళన చెందుతుంది.
bigg boss 5 telugu priyanaka manas selected as best couple in latest episode
ఈ క్రమంలోనే ప్రియాంక, మానస్ పెళ్లి మధ్యలో యాంకర్ రవి లొల్లి షురూ అవుతుంది. మానస్ వల్ల తల్లి తనకు తెలుసని, ఒకవేళ ప్రియాంక, మానస్‌ల పెళ్లి జరిగితే మానస్ తల్లి అడ్డుపడుతుందన్న రేంజ్‌లో మాట్లాడుతాడు. ఈ పెళ్లి మ్యాటర్ మానస్ వాళ్ల మదర్‌కు తెలిస్తే ఎలా అని అంటాడు. అయితే, ఈ మాటలేం పట్టించుకోడు ‘బిగ్ బాస్’. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియాంక, మానస్‌ల కోసం ‘బిగ్ బాస్’ మెగాస్టార్ చిరంజీవి ‘గువ్వా గోరింక’ సాంగ్ ప్లే చేయగా, ఆ సాంగ్‌కు సూపర్ డ్యాన్స్ స్టెప్స్ వేస్తారు ప్రియాంక, మానస్.
Bigg Boss 5 Telugu
ఇక ఈ ఎపిసోడ్‌లోనే రవి, ప్రియకు నాగార్జున క్లాస్ పీకుతాడు. ఈ వారం చెత్త ఆటగాడు ఎవరో చెప్పాలని కంటెస్టెంట్స్‌ను అడగగా, వారు తమ అభిప్రాయాలను చెప్తారు. హౌజ్‌లోని మెజారిటీ కంటెస్టెంట్స్ చెత్త ఆటగాడు విశ్వ అని చెప్పడంతో విశ్వనే వరస్ట్ పర్ఫార్మర్ అని నాగార్జున డిక్లేర్ చేస్తాడు. కాగా, ఆ తర్వాత క్రమంలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో అనే ఉత్కంఠ షురూ అవుతుంది. అయితే, శ్రీరామ్, కాజల్ సేఫ్ అని నాగార్జున ప్రకటిస్తాడు. దాంతో ఎవరు ఈసారి ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారగా, ప్రియ ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.