Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 సన్నీకి అమెరికా అమ్మాయితో పెళ్లి.. కట్నం రూ.100 కోట్లు..!
Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. విన్నర్ వీజే సన్ని లైఫ్ స్టైల్‌ను పూర్తిగా మార్చేస్తోంది. ఈ షోతో తెలుగు నాట ఫుల్ పాపులర్ అయిపోయిన సన్నీ.. హౌస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం.. సన్నీ హవా మామూలుగా లేదు. అటు మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సన్నీ ఇంటర్వ్యూలే దర్శనమిస్తున్నాయి. ఓ వైపు వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటూనే మరోవైపు అభిమానులను కలుసుకుంటూ సన్నీ విరామం లేకుండా గడుపుతున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో ఉన్న తెలుగువారి నుంచి కూడా నిత్యం సన్నీకి ఫోన్లు మెసేజ్ లు వస్తూనే ఉన్నాయట. అయితే ఇలాగే ఇటీవల ఓ మహిళ కాల్ చేసి సన్నీకి ఊహించని ఆఫర్ వచ్చిందట. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా నిలిచింది.
ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో… తనకెదురైన ఓ ఆసక్తికర పరిణామాన్ని సన్నీ తన అభిమానులతో పంచుకున్నారు. రోజూ వందలాది కాల్స్ వస్తుండగా ఇటీవల అమెరికా నుంచి ఉష అనే మహిళా అభిమాని సన్నీకి వీడియో కాల్ చేశారట. సన్నీ ఆమెతో మాట్లాడుతుండగా.. సదరు మహిళ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా.. సన్నీని అడిగారట. అయితే గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరని ఆయన బదులివ్వడంతో సదరు మహిళ సన్నీకి ఊహించని ఆఫర్ ఇచ్చారట. తమ కూతురిని వివాహమాడమని కోరిన ఆ మహిళ.. తనకు రూ. 100 కోట్ల ఆస్తికి పైగా ఉన్నట్లు చెప్పిందట. మరికొద్ది రోజుల్లో మా అమ్మాయి నిన్ను కలవడానికి ఇండియాకు వస్తుందంటూ.. నీవు ఇంకెవరిని చూడవద్దని కోరిందట. దీనికి బదులుగా… నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలని చెప్పిన సన్నీ.. అతని తల్లి ఆస్తి వంటి వాటిని పరిగణనలోకి తీసుకోదని చెబుతూ సున్నితంగా ఆమె ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పుకొచ్చారు.
Bigg Boss 5 Telugu : రూ. 100 కోట్ల కట్నంతో అమెరికా పెళ్లి సంబంధం..
ఇకపోతే.. బిగ్ బాస్ షో నుంచి విన్నర్ సన్నీకి రూ.50 లక్షల ప్రైజ్ మనీను చెక్ రూపంలో అందించారు. దీంతో పాటు రూ.25 లక్షల విలువైన ప్లాట్, 2 లక్షల విలువైన అపాచీ స్పోర్ట్స్ బైక్..105 రోజులు హౌజ్ లో ఉన్నందుకు ఇచ్చిన పేమెంట్ తో దాదాపు కోటి రూపాయలకు పైనే గెలుచుకున్నాడు సన్నీ. ఇక డబ్బు సంగతి పక్కన పెడితే అంతకు మించిన కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాడు. బిగ్ బాస్ హౌజ్ బయటకు వచ్చిన అనంతరం సన్నీ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే సన్నీకి ఓ నాలుగైదు షోలతో పాటు ఒకటి, రెండు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయని తెలుస్తోంది.