Home » Entertainment » Bigg Boss 6 Telugu Contestants List Goes Viral
Entertainment

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 తెలుగు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే.. ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్లు ఎవరంటే?

Authored By
aruna
The Telugu News | Updated on: August 23, 2022, 3:21 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షోకు దేశ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇక తెలుగులోనూ ఈ షోకు విపరీతమైన ఆదరణ లభించింది. మొదటి సీజన్‌తోనే ఈ షో అదిరిపోయే రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసింది. యంగ్ టైగర్ తారక్ హోస్టింగ్, కంటెస్టెంట్ల ఆట తీరు అంతా కలిసి షోను పైకి లేపేసింది. ఇక రెండో సీజన్‌కు నాని హోస్ట్‌గా వచ్చాడు. ఆ షో కేవలం కౌశల్ వల్లే హిట్ అయింది. నాని హోస్టింగ్‌కు ఓ మోస్తరు మార్కులు పడ్డాయి. కానీ నాని మాత్రం ఆ షోను సరిగ్గా హ్యాండిల్ చేయలేదనే విమర్శ వచ్చి పడింది. మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హోస్ట్‌గా మారాడు. అప్పటి నుంచి నాగార్జునే ఈ షోను నడిపించేైస్తున్నాడు. మూడు, నాలుగు, ఐదు సీజన్లను నాగార్జున నడిపిస్తూ సక్సెస్ అయ్యాడు.

Advertisement

ఇక బిగ్ బాస్ ఓటీటీ షోను కూడా నాగార్జున నడిపించేశాడు. ఇక ఇప్పుడు అయితే ఆరో సీజన్ కోసం రంగం సిద్దమైంది. ఆరో సీజన్ అప్డేట్ వచ్చింది. ఇప్పటికే రెండు ప్రోమోలు విడుదల చేశారు. ఆ ప్రోమోల్లో నాగ్ అదరగొట్టేశాడు. ఇప్పుడు ఈ ఆరోసీజన్ కంటెస్టెంట్ల విషయంలోనూ ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పుడు మాత్రం ఆరో సీజన్‌కు సంబంధించిన లిస్ట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఇందులోని కంటెస్టెంట్ల పేర్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. యూట్యూబ్‌లో బిగ్ బాస్ రివ్యూలు, ఫన్నీ వీడియోలు చెప్పి జబర్దస్త్ స్టేజ్ మీదకు వచ్చిన గలాటీ గీతూ, చలాకి చంటి, సింగర్ రేవంత్, ఆది రెడ్డి, శ్రీ సత్య, టీవీ 9లో ఇస్మార్ట్ న్యూస్ ద్వారా ఫేమస్ అయిన ఇస్మార్ట్ అంజలి అలియాస్.

Bigg Boss 6 Telugu Contestants List Goes Viral

Advertisement

ఆరోహి, శ్రీహాన్, దీపిక పిల్లి, అర్జున్ కళ్యాణ్, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీగా కనిపించి, ఆ తరువాత ఎన్నో సీరియల్స్‌లో నటించిన సుదీప వంటి వారు ఈ సారి బిగ్ బాస్ ఇంట్లోకి రాబోతోన్నారట. మరి ఈ లిస్ట్ ఎంత వరకు నిజం? ఇందులో ఎంత మంది బిగ్ బాస్ ఇంట్లోకి వస్తారు.. వీరు కాకుండా ఇంకా ఎవరెవరు బిగ్ బాస్ ఇంట్లోకిఅడుగు పెడతారు అనేది వేచి చూడాల్సిందే. సెప్టెంబర్ మొదటి వారం అంటే.. 4వ తేదీ నుంచి బిగ్ బాస్ ఆరో సీజన్ సందడి మొదలు కాబోతోందన్న మాట. ఇకపై ఓ మూడు నెలలు వినోదానికి కొదవ ఉండదని తెలుస్తోంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి