Home » Entertainment » Bigg Boss 6 Telugu Entertains The Audience
Entertainment

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 ఈ సారి ఆ ఇద్ద‌రు భామ‌లు అందాల ఆర‌బోత‌తో ర‌చ్చ చేసేందుకు రెడీ అయ్యార‌ట‌..!

Authored By
Sam C
The Telugu News | Published on: August 31, 2022, 8:00 pm
Advertisement

Bigg Boss 6 Telugu : బుల్లితెర‌పై బిగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు బిగ్ బాస్ సిద్ధంగా ఉంది. ఈ షో ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కుల‌కి మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందిస్తుంది. తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా ఐదు షోలు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు ఆరో సీజ‌న్‌కి రెడీ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ మొదట హోస్ట్ గా ఆ తర్వాత నాని రెండవ హోస్ట్ గా షోను ఎక్కడికో తీసుకువెళ్లారు అయితే మూడో సీజన్ నుంచి నాగార్జున విజయవంతంగా బిగ్ బాస్ ను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఓటీటిలో కూడా నాన్ స్టాప్ షోగా బిగ్ బాస్ కు మంచి క్రేజ్ అయితే దక్కింది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 4న 6వ సీజన్ గ్రాండ్ గా స్టార్ట్ కానుంది.

Advertisement

బిగ్ బాస్ నిర్మాణ సంస్థ మాత్రం ఖర్చుకు ఏ మాత్రం వెనుక పడకుండా ఈ షోను కొనసాగిస్తోంది. అలాగే కంటెస్టెంట్స్ అందరికీ కూడా అడిగినంత పారితోషికం ఇవ్వడానికి కూడా నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇక సీజన్ మొదటి ఎపిసోడ్ నుంచే నిర్వాహకులు ఊహించని టాస్కులను మొదలు పెట్టబోతున్నారు. ఇక మొదటి ఎపిసోడ్ దాదాపు రెండు గంటలకు పైగానే ఉంటుందట. అయితే ఈ క్రమంలో ఎంట్రీ ఇచ్చే ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో ఒక డ్యాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. అంతేకాకుండా ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ తో షోలో హైలెట్ కాబోతున్నారు.

Bigg Boss 6 Telugu entertains the audience

Advertisement

Bigg Boss 6 Telugu  సందడే సంద‌డి..

బిగ్‌బాస్‌ సీజన్ 6 లోకి 20 మంది కంటెస్టెంట్లు వస్తారు. వారిలో కొందరు భామ‌లు త‌మ అందాల‌తో మ‌త్తెక్కించే ప్ర‌య‌త్నం చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఒకరు రాంగోపాల్ వర్మ కంపెనీ నుండి బిగ్‌బాస్‌ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న ఇనెయాా సుల్తానా కేక పెట్టించే అందాల‌తో పిచ్చెక్కించేందుకు సిద్ద‌మైంద‌ట‌. అలాగే హీరోయిన్ వాసంతి కృష్ణతో పాటు ఒక‌ప్ప‌టి ఐటెం గ‌ర్ల్ అభినయశ్రీ కూడా ఈ బిగ్ బాస్ సీజన్లోకి కంటెస్టెంట్ గా రాబోతుంద‌ట‌. వీరి అందాల ఆరబోతతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అలానే కుర్రాళ్లు గుండెల్లో రైళ్లు కూడా పరుగెత్త‌డం ఖాయం అని అంటున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి