Bigg Boss 6 Telugu first episode Highlights update
Bigg Boss 6 Telugu : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక పూర్తి అయ్యింది. వారితో అగ్రిమెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఒకటి రెండు రోజుల్లోనే వారిని క్వారెంటైన్ కి కూడా పంపిస్తారు అంటున్నారు. ఈ సమయంలోనే బిగ్‌బాస్ సీజన్ 6 కి సంబందించిన ప్రారంభోత్స ఎపిసోడ్ కోసం సెట్ ను ఏర్పాటు చేయడం తో పాటు కంటెస్టెంట్స్ ప్రాక్టీస్ లో మునిగి ఉన్నారు. మరో వైపు ప్రముఖులను ఆహ్వానించేందుకు గాను స్టార్ మా వర్గాల వారు సిద్ధం అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి.
బిగ్‌బాస్ గ్రాండ్ ప్రారంభోత్సవ ఎపిసోడ్ కు రికార్డు స్థాయి రేటింగ్ ను దక్కించుకోవడం కోసం స్టార్ మా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోది. ప్రారంభోత్సవ ఎపిసోడ్ ఆధారంగానే మొత్తం సీజన్ ను కొందరు అంచనా వేస్తారు. అందుకే అన్ని విధాలుగా అద్భతంగా ఉంది అన్నట్లుగా టాక్ రావడం కోసం అభిమానులను అలరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి సామాన్యులకు ఛాన్స్ ఇవ్వబోతున్నారు. కనుక వారికి సంబంధించిన ఏవీ చిత్రీకరణ లు కూడా జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ప్రారంభోత్సవ ఎపిసోడ్ హడావుడి మొదలు అయ్యింది.
Bigg Boss 6 Telugu first episode Highlights update
ముగ్గురు టాలీవుడ్ హీరోయిన్స్ బిగ్ బాస్ ప్రారంభోత్సవ ఎపిసోడ్ లో డాన్స్ చేయబోతున్నారు. అంతే కాకుండా ఒక్కో కంటెస్టెంట్ వెళ్లిన సమయంలో వారి యొక్క విభిన్నమైన ప్రోమో ను వేయడం తో పాటు ప్రతి కంటెస్టెంట్ కూడా ఏదో ఒక పర్ఫెర్మాన్స్ ను ఇవ్వబోతున్నారట. ఇదే ఈ సీజన్ యొక్క ప్రారంభోత్సవ ఎపిసోడ్ కి హైలైట్ గా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. స్టార్ మా లో మరో వంద రోజుల పాటు రేటింగ్ జాతర ఉండేలా బిగ్ బాస్ ని ప్లాన్ చేస్తున్నారు. నాగార్జున పై చిత్రీకరించిన మరో ప్రోమో ను విడుదల చేయబోతున్నారు. సెప్టెంబర్ మొదటి ఆది వారం సీజన్ 6 కి అంకురార్పణ చేయబోతున్నారు.
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
Hair Loss : చాలామంది వెంట్రుకలు ఊడిపోతుంటే చాలా బాధపడుతుంటారు. మనస్థాపానికి గురవుతారు. బట్టతల వస్తే చిన్నవయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.…
Cluster Beans : చిక్కుడుకాయలు చాలామంది ఇష్టంగా తింటారు కానీ గోరుచిక్కుడుకాయను మాత్రం అస్సలు ఇష్టపడరు. చాలామంది దీనిని చూస్తేనే…
This website uses cookies.