Bigg Boss 6 Telugu : నాగార్జున నిర్ణయాన్నే తప్పుపట్టిన కీర్తి.. అసలేంటమ్మా నీ ప్రాబ్లెం..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 18, 2022, 11:00 am

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో సీరియ యాక్టర్ కీర్తి భట్ తన మార్క్ చూపించాలని వచ్చింది. అంతకుముందు ఎలా ఉన్నా రెండవ వారం ఎపిసోడ్ లో తన గతం గురించి చెప్పి హౌజ్ మెట్స్ ని మాత్రమే కాదు ఆడియన్స్ ని కూడా కంటతడి పెట్టించేసింది. అప్పటినుంచి కీర్తి నామినేషన్స్ లో ఉన్నా సరే ఆమెకి ఓట్లు వేసి సేవ్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే ఎవరి సింపతీ తనకు అవసరం లేదు తన ఆటని చూపించే తను ముందుకు వెళ్తానని అన్న కీర్తి. కొన్నిసార్లు అవతల వాళ్లు చెప్పిన విషయాన్ని కూడా అర్ధం చేసుకోక వారు ఇచ్చే సలహాని కూడా తప్పుపట్టే పరిస్థితి వస్తుంది.

ఎవరో ఏమో కానీ రీసెంట్ గా వీకెండ్ లో హోస్ట్ నాగార్జునని కూడా ఎదురు ప్రశ్నించి షాక్ ఇచ్చింది కీర్తి. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బాస్కెట్ లో బాల్ వేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఫైమా, కీర్తి, రేవంత్ ముగ్గురు ఒకే బాల్ తో కొద్దిసేపు కొట్లాడారు. అయితే ఇంతలో బాలాదిత్య వచ్చి రోహిత్ దగ్గర బాల్ తీసుకుని సుదీపాకి ఇస్తే ఆమె ఆ బాల్ ని రోహిత్ బాస్కెట్ లో వేసింది. అక్కడ టాస్క్ ఓడిన ఫైమా, కీర్తిలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ విషయంపై ఫైమాకి నాగార్జున క్లారిటీ ఇచ్చి వారం మొత్తం పర్ఫార్మెన్స్ లో గొడ్ బోర్డ్ ఇచ్చారు.

Bigg Boss 6 Telugu Keerti Bhatt to host nagarjuna

Bigg Boss 6 Telugu Keerti Bhatt to host nagarjuna

అయితే అదే టాస్క్ లో ఆడిన కీర్తి.. మిగతా అంశాలు పరిగ్ణలో తీసుకుని నాగ్ ఆమెకి యావరేజ్ బోర్డ్ ఇచ్చారు. అయితే అక్కడ కీర్తి ఫైమాకి గుడ్ ఇచ్చి నాకు యావరేజ్ ఏంటి సర్ అని అన్నది. ఫైమా నువ్వు ఒకటేనా అని అడిగాడు నాగ్.. ఒకటే కాదు సర్ ఫైమా కన్నా తానే బాగా ఆడానని అన్నది. దానికి నాగార్జున ఎదురుగా ఉన్న ఆడియన్స్ నో అని చెప్పారు. ఆ టాస్క్ కాకుండా వారం మొత్తం ఏం చేశావో చెప్పు అని కీర్తి ని అడిగాడు నాగార్జున. దానికి ఆమె సైలెంట్ అయ్యింది. అలా కీర్తి హోస్ట్ నాగార్జున నిర్ణయానే తప్పుపట్టేలా చేసింది. అయితే నెక్స్ట్ వీక్ బాగా ఆడితే తాను గుడ్ బోర్డ్ ఇస్తానని నాగ్ కాస్త పుషింగ్ ఇచ్చారు.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp