
bigg boss 6 telugu star maa tv clarity about starting rumors
Bigg Boss 6 Telugu : తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ కు అడిక్ట్ అయినట్లుగా పరిస్థితి కనిపిస్తుంది. బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ఎప్పుడు ఎప్పుడు అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా బిగ్ బాస్ సీజన్ లు ఆలస్యం అయ్యాయి. కాని ఈసారి మాత్రం అలా కాకుండా కచ్చితంగా ఆగస్టు లోనే సీజన్ ను ప్రారంభిస్తాం అంటూ స్టార్ మా అధికారికంగా ఇటీవలే ప్రకటించింది. కాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్డేట్ ఇవ్వక పోడంతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ ను విపరీతంగా అభిమానించే వారు ఫాలో అయ్యే వారు ఎప్పుడు ఎప్పుడు అంటూ జుట్టు పీక్కుంటున్నారు.
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 విషయంలో చాలా నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఉదయభాను ఎంపిక అయ్యిందని.. ఇంకా ఒక సీనియర్ హీరో కనిపించబోతున్నాడు అంటూ రకరకాలుగా పుకార్లు షికార్లు అయితే చేస్తున్నాయి. కాని ఇప్పటి వరకు స్టార్ మా నుండి మాత్రం క్లారిటీ లేదు. మొన్నటికి మొన్న బిగ్ బాస్ ప్రోమో షూట్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఇప్పటి వరకు ప్రోమో అప్‌డేట్ లేదు. బిగ్ బాస్ ప్రోమో విడుదల అయితే కచ్చితంగా విడుదల తేదీ విషయంలో ఒక క్లారిటీ వచ్చినట్లే అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
bigg boss 6 telugu star maa tv clarity about starting rumors
బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ ను తీసుకు రావడం వల్ల వెంటనే మరో సీజన్ ను తీసుకు వచ్చేందుకు కాస్త ఆలస్యం అవుతుంది. పైగా నాగార్జున కూడా బిజీ బిజీగా ఉండటం వల్ల షో అనేది ఆలస్యం అవుతుంది అంటూ బుల్లి తెర వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇంతకు స్టార్ మా వారు అనధికారికంగా ఏమన్నారంటే ప్రోమో కోసం షూటింగ్ పూర్తి అయ్యింది. ఆ ప్రోమోను టెలికాస్ట్ చేసిన సమయంలోనే కచ్చితంగా బిగ్ బాస్ ఎప్పుడు ప్రారంభం అయ్యేది చెప్తాం అన్నారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ ఉంటుందని స్టార్ మా వర్గాల వారు చెప్పుకొచ్చారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.