
when will Jr NTR again come back to small screen like TV
Jr NTR : ఒకప్పుడు సినిమా హీరోలను బుల్లి తెర పై చూడటం అంటే అద్భుతం అన్నట్లుగా చూసేవారు. కాని ఇప్పడు సినిమా కంటే ఎక్కువ క్రేజ్ ను బుల్లి తెర దక్కించుకుంది. అందుకే పెద్ద పెద్ద హీరోలు కూడా బుల్లి తెరపై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగానే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్.. ఆమీర్ ఖాన్.. షారుఖ్ ఖాన్ లు కూడా బుల్లి తెరపై సందడి చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. మన తెలుగు స్టార్ హీరోలు కూడా బుల్లి తెరపై ఓ రేంజ్ లో సందడి చేసి మెప్పించిన విషయం తెల్సిందే.
తెలుగు హీరోల్లో చిరంజీవి.. నాగార్జున.. ఎన్టీఆర్ లు బుల్లి తెరను షేక్ చేశారు. ఎన్టీఆర్ బిగ్ బాస్ ఒక్క సీజన్ కే హోస్ట్ గా వ్యవహరించాడు. మళ్లీ ఆయన హోస్టింగ్ కుదరలేదు. ఆ తర్వాత ఎవరు మీలో కోటీశ్వరులు షో కు హోస్ట్ గా వ్యవహరించాడు. బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది కాని ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం మాత్రం నిరాశ పర్చింది. దాంతో ఎన్టీఆర్ ను మళ్లీ ఎప్పుడు బుల్లి తెర పై చూస్తాం అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
when will Jr NTR again come back to small screen like TV
మామూలుగా అయితే ఎవరు మీలో కోటీశ్వరులు సక్సెస్ అయ్యి ఉంటే సీజన్ 2 ఇప్పటికే ప్రారంభం అయ్యి ఉండేది. కాని ఇప్పుడు ఆ షో కు సీజన్ 2ను తీసుకు వచ్చేందుకు జెమిని టీవీ కూడా ఆసక్తిగా లేదు. అందుకే ఎన్టీఆర్ ఆ షో తో మళ్లీ వస్తాడనే నమ్మకం లేదు. అలాగే ఎన్టీఆర్ యొక్క వరుస సినిమాల కారణంగా కొత్తగా ఏమైనా కార్యక్రమాలకు ఆహ్వానం వచ్చినా కూడా వెళ్లే అవకాశం లేదు. ఇక హోస్టింగ్ అంటే ఎవరు మీలో కోటీశ్వరులు ఎఫెక్ట్ తో ఎన్టీఆర్ మళ్లీ ఆ ప్రయత్నం చేయక పోవచ్చు అంటూ ఆయన అభిమానులు సన్నిహితులు అంటున్నారు. కాని చాలా మంది మాత్రం బుల్లి తెరపై ఎన్టీఆర్ ను చూడాలని కోరుకుంటున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.