Home » Entertainment » Bigg Boss 7 Telugu First Week Nominated Contestents
Entertainment

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 ఫస్ట్ వీక్ నామినేషన్ అయిన ఇంటి సభ్యులు వీళ్లే ..!!

Authored By
aruna
The Telugu News | Published on: September 5, 2023, 6:00 pm
Advertisement

Bigg Boss 7 Telugu : ఉల్టా పుల్టా సీజన్ అంటూ ఫస్ట్ డే నే బిగ్బాస్ పై హైప్ పెంచేశారు హోస్ట్ నాగార్జున. అయితే తొలి వారం నామినేషన్ లో ఎలాంటి ట్విస్టులు లేవు. ప్రతి సీజన్లో మాదిరి హౌస్ లో అర్హత లేని వారి పేర్లు చెబుతూ ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిద్దరి పేర్లు చెప్పాలని బిగ్ బాస్ చెప్పడంతో నామినేషన్స్ హీట్ స్టార్ట్ అయింది. ఈరోజు రాత్రి జరిగే నామినేషన్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్, శోభా శెట్టి, షకీలా, రితిక ఏడుగురు కంటెస్టెంట్లు తొలి వారం నామినేషన్ లో ఉన్నారు.

Advertisement

ఈ నామినేషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఇంకా ఒకరిద్దరూ నామినేషన్ లిస్టు లోకి వచ్చే అవకాశం ఉంది. అయితే అత్యధికంగా హీరో గౌతం కృష్ణ కి నామినేషన్ పడ్డాయి. షకీలా తన పని తాను చేసుకుంటూ చాలా మెచ్యూర్డ్ గా గేమ్ ఆడుతూ ఉండగా ఆమెను కూడా నామినేట్ చేశారు. ఇక హౌస్లో వచ్చిన కంటెస్టెంట్స్ లో వీడు ఎవడ్రా బాబు ఇలా ఉన్నాడు అనిపించే కంటెస్టెంట్ లో ప్రిన్స్ యావర్ ఒకరు. అదేంటో ఈయన ఒంటి మీద బట్టలు నిలవడం లేదు. తొలి రోజు ఓవర్ చేసిన యావర్ను బిగ్బాస్ లో ఉంచుతారో లేదో చూడాలి.

Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ 7 ఫస్ట్ వీక్ నామినేషన్ అయిన ఇంటి సభ్యులు వీళ్లే ..!!

Advertisement

ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ హాట్ స్టార్ లో వస్తుంది. నిన్నటి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున హౌస్ సభ్యులనూ టీం గా సంపాదించుకోవాలని చెప్పారు. వాళ్లకు ఏమి టాస్కులు లేకుండానే సోఫాలు కుర్చీలు వేసి ఇంటిని మరింత అందంగా మార్చేశారు. ఉదయం టిఫిన్ సెక్షన్ లో అమర్ దీప్ గరిట పట్టి ఫ్రైడ్ రైస్ చేసి అందరికీ వడ్డించేసాడు. మధ్యాహ్నం భోజనం షకీలా తీసుకుని తమిళనాడు స్టైల్ సాంబారు, బీరకాయ చట్నీ చేసింది. ఇక అమర్దీప్, ఆట సందీప్ క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. పల్లవి ప్రశాంత్, రతికతో క్లోజ్ గా ఉంటుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి