Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 మొదలై ఇప్పటికే 60 రోజులకి పైగా పూర్తి కావడంతో హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. నామినేషన్స్, టాస్క్‌ల సమయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పదో వారం నామినేషన్స్ సమయంలో గౌతమ్, నిఖిల్ మధ్య సవాళ్లు అందరిని ఆశ్చర్యపరిచాయి. మరోవైపు ప్రేరణ – హరితేజ, యష్మి - గౌతమ్ మధ్య కూడా పెద్ద యుద్దమే జరిగింది. నానా మాటలు అనుకున్నారు. నిఖిల్- గౌతమ్ అయితే బయటకు వెళ్లి తేల్చుకుందాం పదా అంటూ.. గేట్లు తీయ్యాల్సిందిగా కోరారు. ఇక నామినేషన్ల వరకూ ఈ వేడి కనిపించినా… ఆతరువాత మాత్రం వీరు నార్మల్ అయ్యి క్లోజ్ గా మాట్లాడుకోవడం కూడా అందరికి తెలిసిందే. అప్పటి వరకే అది కంటీన్యూ అవుతుంటుంది.
నామినేషన్స్‌లో నిఖిల్…. గౌతమ్‌ను నామినేట్ చేశాడు. ఒకరు నో అన్నప్పుడు నో అనే అర్థం…వద్దని చెప్పిన కూడా యష్మిని అక్కా అని పిలిచి ఇబ్బంది పెడుతోన్నావని, నువ్వు నా మీద రూల్ బుక్ విసిరేయడం కూడా నచ్చలేదంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు నిఖిల్. అక్కా అని పిలిస్తే తప్పేంటి….యష్మి కూడా తనను తమ్ముడు అని పిలిచిందా కదా అంటూ నిఖిల్‌తో గౌతమ్ వాదించాడు. నిన్ను అశ్వత్థామ 2.0 అని పిలిస్తే బాధపడ్డావ్ కదా…అలా పిలవొద్దని, అందరితో చెప్పావు…అక్కా అని పిలవొద్దని యష్మి చెప్పినప్పుడు కూడా నువ్వు వినకుండా అలాగే పిలుస్తుంటే అదే బాధే ఉంటుందని నిఖిల్ వాదించాడు. ఇక నుంచి నువ్వు నన్ను అశ్వత్థామ అని పిలిచుకో… అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్…నిఖిల్‌తో ఛాలెంజ్ చేశాడు.
నా మీద ఉన్న కోపాన్ని హౌజ్‌లోని ఆడపిల్లలపై చూపించొద్దని గౌతమ్‌కు నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. గౌతమ్‌కు రోహిణి, హరితేజ సపోర్ట్‌చేశారు. గౌతమ్ మాట్లాడింది కరెక్ట్ అన్నట్లుగా అతడి మాట్లాడిన ప్రతిసారి చప్పట్లు కొట్టారు. తర్వాత గౌతమ్ వంతు వచ్చింది. అతడు యష్మిని నామినేట్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు. విష్ణుప్రియ…ప్రేరణను నామినేట్ చేసింది. గేమ్‌లో తప్పులు చేయడం వల్లే నిన్ను నామినేట్ చేయాల్సివచ్చిందని అన్నది. మెగా చీఫ్‌గా ఫెయిలయ్యావని విష్ణుప్రియను నబీల్ నామినేట్ చేశాడు. టేస్టీ తేజ…పృథ్వీని….హరితేజ…ప్రేరణను నామినేట్ చేశారు. పృథ్వీ రోహిణిని నామినేట్ చేశాడు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. నిఖిల్, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, విష్ణుప్రియ, హరితేజ, గౌతమ్ నామినేషన్స్‌లో ఉన్నారు
Us Elections 2024 : ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమైంది.…
Virat Kohli Birthday : టీమిండియా Team India మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ …
Vangalapudi Anitha : పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి చాలా కూల్‌గా కనిపిస్తూ వచ్చారు. అయితే ఆయన తాజాగా…
Fingers : చాలా మంది చేతి వేళ్లను అప్పుడప్పుడు ఇరుస్తూ ఉంటారు. ఇది ఒక అలవాటుగా మారుతుంది. ఇలా చేతి వేళ్లను…
Drinking Water : ప్రస్తుత కాలంలో మారుతున్నటువంటి జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన రక్తపోటు బారిన పడే వారి సంఖ్య…
EPS New System : ఉద్యోగుల పెన్షన్ స్కీం తో పాటు పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. 2025…
Rice Water : ప్రస్తుత కాలంలో చాలా మంది తమ జుట్టు ఆరోగ్యం కోసం సహజ పద్ధతులను మరియు ఇంటి చిట్కాలపై…
TG Govt Skills University Jobs : ప్రపంచస్థాయి నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా…
This website uses cookies.