Bigg Boss 8 Telugu : నామినేష‌న్ ర‌చ్చ‌.. బ‌య‌టికెళ్లి తేల్చుకుందాం రా అంటూ స‌వాళ్లు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 8 Telugu : నామినేష‌న్ ర‌చ్చ‌.. బ‌య‌టికెళ్లి తేల్చుకుందాం రా అంటూ స‌వాళ్లు

 Authored By ramu | The Telugu News | Updated on :5 November 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : నామినేష‌న్ ర‌చ్చ‌.. బ‌య‌టికెళ్లి తేల్చుకుందాం రా అంటూ స‌వాళ్లు

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 8 మొద‌లై ఇప్ప‌టికే 60 రోజుల‌కి పైగా పూర్తి కావ‌డంతో హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ఫ్ర‌స్ట్రేష‌న్ పెరుగుతుంది. నామినేష‌న్స్, టాస్క్‌ల స‌మ‌యంలో చాలా దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ప‌దో వారం నామినేష‌న్స్ స‌మ‌యంలో గౌత‌మ్, నిఖిల్ మ‌ధ్య స‌వాళ్లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాయి. మ‌రోవైపు ప్రేరణ – హరితేజ, యష్మి ‌- గౌతమ్ మ‌ధ్య కూడా పెద్ద యుద్దమే జరిగింది. నానా మాటలు అనుకున్నారు. నిఖిల్- గౌతమ్ అయితే బయటకు వెళ్లి తేల్చుకుందాం పదా అంటూ.. గేట్లు తీయ్యాల్సిందిగా కోరారు. ఇక నామినేషన్ల వరకూ ఈ వేడి కనిపించినా… ఆతరువాత మాత్రం వీరు నార్మల్ అయ్యి క్లోజ్ గా మాట్లాడుకోవడం కూడా అందరికి తెలిసిందే. అప్పటి వరకే అది కంటీన్యూ అవుతుంటుంది.

Bigg Boss 8 Telugu క‌ట్ట‌లు తెంచుకున్న కోపం..

నామినేష‌న్స్‌లో నిఖిల్‌…. గౌత‌మ్‌ను నామినేట్ చేశాడు. ఒక‌రు నో అన్న‌ప్పుడు నో అనే అర్థం…వ‌ద్ద‌ని చెప్పిన కూడా య‌ష్మిని అక్కా అని పిలిచి ఇబ్బంది పెడుతోన్నావ‌ని, నువ్వు నా మీద రూల్ బుక్ విసిరేయ‌డం కూడా న‌చ్చ‌లేదంటూ గౌత‌మ్‌ను నామినేట్ చేశాడు నిఖిల్‌. అక్కా అని పిలిస్తే త‌ప్పేంటి….య‌ష్మి కూడా త‌న‌ను త‌మ్ముడు అని పిలిచిందా క‌దా అంటూ నిఖిల్‌తో గౌత‌మ్ వాదించాడు. నిన్ను అశ్వ‌త్థామ 2.0 అని పిలిస్తే బాధ‌ప‌డ్డావ్ క‌దా…అలా పిల‌వొద్ద‌ని, అంద‌రితో చెప్పావు…అక్కా అని పిల‌వొద్ద‌ని య‌ష్మి చెప్పిన‌ప్పుడు కూడా నువ్వు విన‌కుండా అలాగే పిలుస్తుంటే అదే బాధే ఉంటుంద‌ని నిఖిల్ వాదించాడు. ఇక నుంచి నువ్వు న‌న్ను అశ్వ‌త్థామ అని పిలిచుకో… అశ్వ‌త్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌత‌మ్…నిఖిల్‌తో ఛాలెంజ్ చేశాడు.

Bigg Boss 8 Telugu నామినేష‌న్ ర‌చ్చ‌ బ‌య‌టికెళ్లి తేల్చుకుందాం రా అంటూ స‌వాళ్లు

Bigg Boss 8 Telugu : నామినేష‌న్ ర‌చ్చ‌.. బ‌య‌టికెళ్లి తేల్చుకుందాం రా అంటూ స‌వాళ్లు

నా మీద ఉన్న కోపాన్ని హౌజ్‌లోని ఆడ‌పిల్ల‌ల‌పై చూపించొద్ద‌ని గౌత‌మ్‌కు నిఖిల్ వార్నింగ్ ఇచ్చాడు. గౌత‌మ్‌కు రోహిణి, హ‌రితేజ స‌పోర్ట్‌చేశారు. గౌత‌మ్ మాట్లాడింది క‌రెక్ట్ అన్న‌ట్లుగా అత‌డి మాట్లాడిన ప్ర‌తిసారి చ‌ప్ప‌ట్లు కొట్టారు. త‌ర్వాత గౌత‌మ్ వంతు వ‌చ్చింది. అత‌డు య‌ష్మిని నామినేట్ చేసి రివేంజ్ తీర్చుకున్నాడు. విష్ణుప్రియ‌…ప్రేర‌ణ‌ను నామినేట్ చేసింది. గేమ్‌లో త‌ప్పులు చేయ‌డం వ‌ల్లే నిన్ను నామినేట్ చేయాల్సివ‌చ్చింద‌ని అన్న‌ది. మెగా చీఫ్‌గా ఫెయిల‌య్యావ‌ని విష్ణుప్రియ‌ను న‌బీల్ నామినేట్ చేశాడు. టేస్టీ తేజ‌…పృథ్వీని….హ‌రితేజ…ప్రేర‌ణ‌ను నామినేట్ చేశారు. పృథ్వీ రోహిణిని నామినేట్ చేశాడు. మొత్తంగా ఈ వారం నామినేష‌న్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. నిఖిల్‌, పృథ్వీ, య‌ష్మీ, ప్రేర‌ణ‌, విష్ణుప్రియ‌, హ‌రితేజ‌, గౌత‌మ్ నామినేష‌న్స్‌లో ఉన్నారు

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది