
Bigg Boss 8 Telugu : ఊహించిందే జరిగింది.. మెహబూబ్ కోసం ఆమెని ఎలిమినేట్ చేశారా..!
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నెల రోజుల పాటు కాస్త చప్పగా.. సాగిన షోను రి లాంచ్ చేసి ఇప్పుడు మరింత క్యూరియాసిటీ పెంచారు. గత సీజన్లో ఎప్పుడు చూడని కంటెంట్ ఇస్తుండటంతో భారీ రెస్పాన్స్ వస్తుంది. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దూసుకపోతోంది. ఈ ఆదివారం ఊహించినట్టుగానే కిరాక్ సీతని బయటకు పంపించేశారు. ఆమె ఎలిమినేట్ అవ్వడం పై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో మొదటి నుంచి స్ట్రాంగ్ గా ఉన్న ఈమె వెళ్లిపోవడం ఏంటి అని ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఇక వీక్ గా ఉన్న వాళ్లను పంపించకుండా ఇలా సీతను పంపించడం ఏంటని ప్రశ్నిస్త్తున్నారు..
హౌస్ లో అతడు నామినేట్ చేస్తే పక్కా ఎలిమినేట్ అవ్వాల్సిందే అనే సెంటిమెంట్ ఉంది అంటూ వార్త వినిపిస్తుంది. గత వారం నామినేషన్స్‌లో తేజ సూటిగా, సుత్తి లేకుండా మాట్లాడాడు. కరెక్ట్ పాయింట్లు చెప్తూ సీత, మణికంఠను నామినేట్ చేశాడు. అయితే మణికి ఒకే ఒక్క నామినేషన్ పడటంతో అతడు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు.. సీత బలైంది. ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పటికే సండే ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తవగా సీత ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది..గత సీజన్‌లో కూడా తేజ నామినేట్ చేసి లేడి కంటెస్టెంట్ తొందరగానే బయటకు వచ్చేసింది. సీత చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కాని.. హౌస్ లో ఆమె కంటే లూజ్ కంటెస్టెంట్స్ చాలామంది ఉన్నారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి వచ్చి మెహబూబ్ ఈ వారంలో పెద్దగా పెర్పామ్ చేసింది లేదు.
Bigg Boss 8 Telugu : ఊహించిందే జరిగింది.. మెహబూబ్ కోసం ఆమెని ఎలిమినేట్ చేశారా..!
అయినా సరే సీతకంటే ఎక్కువ ఓట్లు మెహబూబ్ కు పడే అవకాశం ఎంత వరకూ ఉంది అనేది ఆడియన్స్ నుంచి వస్తున్న ప్రశ్న. అంతే కాదు మెహబూబ్ ఫిజికల్ గేమ్స్, బాగా ఆడుతాడు. కాంట్రవర్సీ కంటెస్టెంట్ గా గత బిగ్ బాస్ లో మెహబూబ్ కు పేరుంది. దాంతో మెహబూబ్ ను కాపాడటం కోసం.. సీతను ఎలిమినేట్ చేశారా అనే అనుమానం ఉంది. ఇక దసరా సందర్భంగా బిగ్ బాస్ హౌస్ లోకి సింగర్ మంగ్లీతో పాటు, హీరో గోపీచంద్, డైరెక్ట శ్రీను వైట్ల కూడా గెస్ట్ లు గా వచ్చారు. మంగ్లీ తన పాటలతో ఉర్రూతలూగించింది. బతుకమ్మ పోటీ పెట్టి.. ఇంట్లో బతుకమ్మ ఆటలు ఆడించింది. హౌస్ లో కూడా రకరకాల టాస్క్ లు.. ఫన్ గేమ్స్ ఆడించారు నాగ్.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.