Bhanu Sri : బిగ్ బాస్ భాను శ్రీ కి పెళ్లి ఘ‌డియ‌లు వ‌చ్చేశాయి.. వ‌రుడు ఎవ‌రో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Authored By Sam C | The Telugu News | Published on: September 2, 2022, 9:00 pm

Bhanu Sri : సీరియ‌ల్స్, సినిమాల‌లో న‌టించిన‌ప్ప‌టికీ కొంద‌రు గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే బిగ్ బాస్ షోలో అడుగుపెట్టారో వారికి మంచి ఇమేజ్ ద‌క్కింది. అలాంటి వారిలో భానుశ్రీ ఒక‌రు. మోడల్ గా తన కేరీర్ ను ప్రారంభించిన భానుశ్రీ.. ఇప్పుడిప్పుడే నటిగా అవకాశాలు అందుకుంటోంది. గతంలో జెమినీ టీవీలో ప్రారమయ్యే టెలివిజన్ డైలీ సీరియల్ ‘జాబిలమ్మ’లో నటించింది. తన పాత్రకు న్యాయం చేయడంతో పలు చిత్రాల్లోనూ అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 2తో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తనదైన శైలిలో టాస్క్ లను ఆడి పాపులర్ అయ్యింది. కానీ షో మధ్యలోనే ఎలిమినేట్ అయ్యింది. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత భానుకు మరింత క్రేజ్ పెరిగింది.

Bhanu Sri : భానుకి పెళ్లి క‌ళ‌..

ఎక్కువగా భాను శ్రీ ఈటీవీ ఈవెంట్స్ లో కనిపిస్తూ ఉంటుంది . అందుతున్న సమాచారం ప్రకారం భాను శ్రీ ఒక్కో ఈవెంట్ కి 30 నుంచి 50 వేలు దాకా అందుకుంటుందట. ఇక ఈ అమ్మ‌డు త్వ‌ర‌లో ఓ ఇంటిది కాబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈమె తన కెరియర్ మొదటి నుంచి తన ఫ్రెండ్ ని ప్రేమిస్తుందని అతన్ని పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది . గతంలో ఇంటర్వ్యూలో భాను మాట్లాడుతూ..” తాను కెరియర్ లో సెటిల్ అవ్వడానికి తన ఫ్రెండే కారణం అని, అతని ఎప్పటికి తన లైఫ్ లో మర్చిపోలేని ” చెప్పుకొచ్చింది. దీంతో అతన్నే భాను పెళ్లి చేసుకోబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.

Bigg Boss Bhanu Sri Is Getting Married Soon

Bigg Boss Bhanu Sri Is Getting Married Soon

భాను ప్రస్తుతం హీరోయిన్ గాను అవకాశాలు అందుకుంటోంది. ఈ సందర్భంగా భాను తన పాపులారిటీని మరింతగా పెంచుకునేందుకు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా ఉంటోంది. లేటెస్ట్ గా ఫొటోషూట్లు నిర్వహిస్తూ నెటిజన్లను తనవైపు ఆకర్షిస్తోంది. ఇఫ్పటికే ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్న భాను శ్రీ తన పాపులారిటీని పెంచుకునేందుకు గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తోంది. ఈ బ్యూటీ అందాలకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp