సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఏం చేసినా సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతుంది. ఒక్క ట్వీటుతో దేశాన్నే కదిలిస్తాడు. ఆయన మాట్లాడింది.. చేసేది ఆ సమయమలో పనికిమాలిన మాటలు అని తోసేసిన ఆ తర్వాత చాలా మంది వాటినే సమర్ధిస్తుంటారు. ఆయన చేసింది కరెక్టే అని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కరోనా వల్ల థియోటర్స్ మూతపడ్డా కూడా వర్మ సంపాదించినంతగా ఎవరూ సంపాదించలేదని అంటుంటారు. ఆయన సంపాదన మాత్రమే కాదు ఆయన ద్వారా చాలామంది క్రేజ్ సంపాదించుకొని సెటిలవుతున్నారు.
శ్రీ రాపాక అంతక ముందు ఎవరికీ పెద్దగా తెలియనప్పటికి ఆర్జీవీ నగ్నం ద్వారా విపరీతంగా పాపులర్ అయింది. ఇప్పుడు తను వరసగా వెబ్ సిరీస్ మూవీస్ చేస్తున్నట్టు చెప్పుకుంటుంన్నారు. ఇక ఆర్జీవీ అప్సర రాణి కూడా బాగా పాపులర్ అయింది. అంతక ముందు రెండు సినిమాలు చేసినప్పటికి రాని క్రేజ్ ఆర్జీవీ థ్రిల్లర్ తో స్టార్ హీరోయిన్ రేంజ్ లో వచ్చింది. అంతేకాదు ఇప్పుడు అప్సర రాణికి టాలీవుడ్ సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేసే ఛాన్సెస్ వస్తున్నాయి. ఇప్పటికే మాస్ మహారాజా రవితేజ తో క్రాక్ సినిమాలో ఉన్న ఐటెం సాంగ్ లో స్టెప్పులేసింది.
అయితే రీసెంట్ గా ఆర్జీవీ చేసిన ట్వీట్ మళ్ళీ హాట్ టాపిక్ అవుతోంది. ఇంతక ముందు ఆర్జీవీ ని ఇంటర్వ్యూ చేసిన యూట్యూబ్ యాంకర్ అరియానా బిగ్ బాస్ లో ఇప్పుడు టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతోంది. టాప్ 5 లో నిలిచింది. ముందు నుంచి హౌజ్ లో సె టిల్డ్ గా ఉన్న అరియానా జనాలని బాగా ఆకట్టుకుంది. అయితే బిగ్ బాస్ కి రాకముందు అరియానా కి అంతగా గుర్తింపు లేదు. కాని వర్మ ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఆయన అరియానా మీద చేసిన హాట్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. కొద్ది రోజుల్లో వచ్చిన ఆ క్రేజ్ వల్లే బిగ్ బాస్ లో ఆల్గొనే ఛాన్స్ దక్కింది.
అయితే ఇప్పుడు వర్మ అరియానా కి ఓట్ చేసి టైటిల్ గెలిపించాల్సిందిగా ట్వీట్ చేశాడు. వర్మ అంత ప్రత్యేకించి అరియానా కి సపోర్ట్ చేస్తున్నాడంటే నిజంగా తనలో టైటిల్ గెలుచుకునే టాలెంట్ ఉందా అని మాట్లాడుకుంటున్నారట. మరోవైపు అరియానా కి వర్మ సపోర్ట్ చేయమనడం కరెక్టే అని మాట్లాడుకుంటున్నారట. కొన్ని విషయాలలో వర్మ మీద వీపరీతమైన నెగిటివిటీ ఉంది. మరి వర్మ చేసిన ట్వీట్ వల్ల అరియానా కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.