నన్నే ఆపి టోల్ ఫీజు చెల్లించమంటావా? రెచ్చిపోయిన వైసీపీ మహిళా నేత.. వీడియో వైరల్
ఒక్క వీడియో చాలు.. సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ కావడానికి. వాళ్లు ఎంత పెద్ద తోపులైనా.. తప్పు చేస్తూ కెమెరా కంటికి చిక్కితే చాలు.. క్షణాల్లో వాళ్ల ఫేమ్ అంతా నీరుకారిపోతుంది. దెబ్బకు వాళ్ల పాపులారిటీ తగ్గిపోతోంది. తాజాగా అటువంటి ఘటనే ఒకటి ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.
YSRCP leader D Revathi slaps a toll plaza staff at Kaja Toll in Guntur district
ఏపీ వడ్డెర కార్పొరేషన్ చైర్ పర్సన్ రేవతి టోల్ ప్లాజా వద్ద రచ్చ రచ్చ చేశారు. గుంటూరు జిల్లాలో ఉన్న కాజా టోల్ ప్లాజా వద్ద ఆమె టోల్ సిబ్బందితో గొడవ పెట్టుకున్నారు.
విజయవాడ వైపు వెళ్తున్న ఆమె టోల్ ప్లాజా వద్ద ఆగకుండా.. టోల్ ఫీజు చెల్లించుకుండా కారులో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. టోల్ సిబ్బంది అడ్డుకున్నారు. తన కారుకు అడ్డంగా బారికేడ్లు పెట్టారు. దీంతో కోపోద్రికురాలైన రేవతి.. తన కారునే అడ్డుకుంటారా? తననే ఆపి టోల్ ఫీజు చెల్లించమంటారా? అంటూ కోపంతో ఊగిపోయి.. బారికేడ్లను తొలగించి.. సిబ్బందిపై చేయి చేసుకున్నారు. అనంతరం.. బారికేడ్లను పక్కకు నెట్టి ఆమె కారులో టోల్ ఫీజు చెల్లించకుండానే వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
