Bigg Boss Himaja : అవసరమైతే ఆ పని చేస్తా.. మీకేంటి నొప్పి.. కడిగిపారేసిన బిగ్ బాస్ హిమజ.. వీడియో

Advertisement

Bigg Boss Himaja : బిగ్ బాస్ హిమజ తెలుసు కదా. తను బిగ్ బాస్ ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ తోనే తనకు చాలా గుర్తింపు వచ్చింది. నిజానికి తను ముందు బుల్లి తెరలో సీరియళ్లలో నటించింది. ఆ తర్వాత సోషల్ మీడియా ద్వారా తనకు ఇతర అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. వెండి తెర మీద కూడా పలు సినిమాల్లో నటించిన హిమజ.. ఆ తర్వాత బుల్లి తెర మీద పలు షోలలోనూ నటిస్తోంది. అప్పుడప్పుడు షోలలో కనిపిస్తూ సందడి చేస్తోంది. బిగ్ బాస్ 3 తర్వాత తన లైఫ్ అయితే మారిపోయింది. తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకుంది.

Bigg Boss Himaja answers to netizens trolls
Bigg Boss Himaja answers to netizens trolls

బిగ్ బాస్ 3 తర్వాత తనకు చాలా అవకాశాలు వచ్చాయి కానీ.. ఎందుకో తనకు అంత గుర్తింపు మాత్రం రాలేదు అనే చెప్పుకోవాలి. కొన్ని యాడ్స్ లో నటించడం, ఏవైనా ఓపెనింగ్స్ కు వెళ్లడం, బుల్లితెర మీద పలు షోలలో నటించడం తప్పితే పెద్దగా తనకు అవకాశాలు అయితే రావడం లేదనే చెప్పుకోవాలి. అయితే.. సోషల్ మీడియాలో మాత్రం హిమజ బిజీ బిజీగా ఉంటోంది. తన ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తోంది. గ్లామర్ షో మాత్రం అస్సలు చేయదు హిమజ. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Advertisement
Bigg Boss Himaja answers to netizens trolls
Bigg Boss Himaja answers to netizens trolls

Bigg Boss Himaja : సోషల్ మీడియాలో బిజీ బిజీగా హిమజ

ఇటీవల తను గుడికి వెళ్తా అంటూ నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పింది. దానికి అక్కడికి వెళ్లి ధ్యానం చేస్తారా అంటే.. లేదు గుడికి వచ్చే వాళ్లు చెప్పులు వదిలేస్తుంటారు కదా.. వాటిని మారుస్తుంటాను అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చింది హిమజ. వాళ్ల వచ్చాక అవి అక్కడే ఉన్నాయని చెబుతుంటాను అని చెప్పేసరికి నెటిజన్లు ఒక్కసారిగా తనపై విరుచుకుపడ్డారు. ఇన్ని రోజులకు నిజం చెప్పావబ్బా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మీరు ఏ గుడికి వెళ్తారో చెబితే ఇంకోసారి ఆ గుడికి వెళ్లినప్పుడు చెప్పులు వేసుకొని రాము అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. దీంతో ఆ ట్రోల్స్ ను ఎలా మేనేజ్ చేయాలో హిమజకు మాత్రం అర్థం కాలేదు.

Advertisement
Advertisement