Home » Entertainment » Bigg Boss Ott Final List
Entertainment

Bigg Boss OTT : ఈ రోజు సాయంత్రం బిగ్ బాస్ ఓటీటీ గ్రాండ్ లాంచ్.. హౌజ్‌లో అడుగుపెట్ట‌నుంది వీళ్లే..!

Authored By
Sam C
The Telugu News | Published on: February 26, 2022, 12:30 pm
Advertisement

Bigg Boss OTT: స్మాల్ స్క్రీన్‌పై ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి కొద‌వే లేదు. అయితే బిగ్ బాస్ షోతో మ‌రింత ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందించేందుకు బిగ్ బాస్ ఓటీటీ వ‌స్తుంది. ఈ రోజు సాయంత్రం నుండి ఈ షో మొద‌లు కానుండ‌గా, దాదాపు వంద రోజుల పాటు ఈ షో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నుంది కేవలం ఒక గంటో.. రెండు గంటలో కాకుండా ఈసారి ఏకంగా 24 గంటలు వినోదాన్ని పంచబోతోంది. దాదాపు ఐదేళ్లుగా.. 5 సీజన్లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది బిగ్ బాస్ రియాల్టీ షో. అయితే 24 గంటలు హౌస్ లో జరిగే విషయాలను ఒక గంట మాత్రమే ప్రసారం చేయడంతో.. చాలా ఫన్ ను ఆడియన్స్ మిస్ అవుతున్నారు అన్న ఉద్ధేశ్యంతో.

Advertisement

24 గంటలు హౌస్ లో ఏం జరుగుతుందో చూస్తూ.. ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు.ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‏లోఈ రోజు నుంచి రియాల్టీ షో నాన్ స్టాప్ గా ప్రసారం కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన లోగో.. ప్రోమో విడుదల చేయ‌డంతో పాటు రీసెంట్‌గా బిగ్ బాస్ హౌజ్ కూడా చూపించారు.చాలా క‌ల‌ర్‌ఫుల్‌గా హౌజ్ క‌నిపించ‌డంతో ప్రేక్ష‌కులు సంబ‌ర‌ప‌డి పోయారు. బిగ్‏బాస్ ఓటీటీ వస్తోంది అన్నప్పటి నుంచి కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయంపై బయట తెగ చర్చ నడుస్తోంది. ఇందులో ఫ్రెష్ కంటెస్టెంట్స్ తో పాటు మాజీ కంటెస్టెంట్స్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.

bigg boss ott final list

Advertisement

Bigg Boss OTT : బిగ్ బాస్ సంద‌డి షురూ..

మ‌రి కొద్ది గంట‌ల‌లో మొద‌లు కానున్న‌ బిగ్‏బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ వీరే అంటూ ప్రచారం నడుస్తోంది. అందులో యాంకర్ స్రవంతి, యాంకర్ శివ, ముమైత్ ఖాన్, ఆర్జే చైతూ ఈ ఐదుగురు స్టార్స్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అషు రెడ్డి, మహేష్ విట్టా, అరియానా, అఖిల్ సార్థక్, హమీద, సరయు, నటరాజ్ మాస్టర్, ముమైత్ ఖాన్, మోడల్ అనిల్ రాథోడ్, నటి, మోడల్ మిత్ర శర్మ, శ్రీరాపాక, బిందు మాధవి, తేజస్వి మదివాడ, రోల్ రిడా కూడా షోలో భాగం కాబోతున్నారట.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి