Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్ జోష్‌తో సాగుతుంది. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు, వారంలో ఎన్ని ఎలిమినేషన్స్ జరుగుతాయి అనేది ప్రశ్నార్ధకంగా మారింది.భారీ అంచనాల నడుమ మొదలైన ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా విజయవంతంగా నడుపుతున్నారు. అయితే, ఇందులో మాత్రం ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అంతు చిక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వారం కూడా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తెలిసింది. వారెవరా అని అందరిలో ఆతృత నెలకొంది.
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి 17 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా అడుగు పెట్టారు. ఇందులో కొత్త వాళ్లతో పాటు మాజీ కంటెస్టెంట్లు కూడా ఉన్నారు. వీళ్లలో నుంచి గడిచిన 8 వారాలకు గానూ ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు, ముమైత్ ఖాన్ (రెండోసారి), స్రవంతి చోకారపు, మహేశ్ విట్టా, అజయ్ కుమార్‌లు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్‌లో అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయారు. ఫలితంగా షోలో ఎప్పుడేం జరుగుతుందో తెలియట్లేదు. తొమ్మిదో వారానికి గానూ జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గతంలో మాదిరిగానే ఎన్నో గొడవలతో సాగింది. చివరకు ఈ వారం నటరాజ్, ఆరియానా, మిత్రా, శివ, హమీదా, అనిల్ రాథోడ్, బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు.
తొమ్మిదో వారం జరుగుతోన్న ఓటింగ్‌లో మిత్రా శర్మ ఎక్కువ ఓట్లతో టాప్ ప్లేస్‌లో ఉందని తెలిసింది. ఆమె తర్వాత యాంకర్ శివకు అత్యధిక ఓట్లు పోల్ అవుతున్నాయట. దీంతో అతడు రెండో స్థానంలో ఉన్నాడట. ఇక, బాబా భాస్కర్ మూడో స్థానంలో, నటరాజ్ మాస్టర్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారని తెలిసింది. అంటే వీళ్లంతా ఈ వారానికి దాదాపుగా సేఫ్ అయినట్లే అని టాక్. ఆరియానా గ్లోరీ, హమీదా ఖటూన్ డేంజర్ జోన్‌లో ఉన్నారని సమాచారం. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు కాబట్టి.. ఐదో స్థానంలో ఉన్న అనిల్ రాథోడ్‌కు కూడా ప్రమాదం పొంచి ఉంది. మొత్తంగా ఈ ముగ్గురిలోనే ఇద్దరు షో నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ముమైత్ ఖాన్, స్రవంతి డబుల్ ఎలిమినేషన్‌తో బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
This website uses cookies.