Home » Entertainment » Bigg Boss Ott Telugu House From Week Rj Chaitu Eliminate
Entertainment

Bigg Boss OTT Telugu : మూడో వారం బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ కానుంది ఎవ‌రో తెలుసా?

Authored By
Sam C
The Telugu News | Published on: March 20, 2022, 7:40 am
Advertisement

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్‌స్టాప్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ షో ఆస‌క్తిక‌రంగా సాగుతుంది. 17 మందితో మొద‌లైన ఈ కార్య‌క్ర‌మంలో ఇప్ప‌టికే ఇద్ద‌రు ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం ముమైత్‌ ఖాన్‌ ఎలిమినేట్‌ అవగా రెండో వారం వారియర్స్‌కు టఫ్‌ ఫైట్‌ ఇస్తూ ఆడిన శ్రీరాపాక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.తాజాగా మూడో వారం కూడా చాలెంజర్స్‌లో నుంచి ఒకరు ఎలిమినేట్‌ అయినట్లు తెలుస్తోంది. లీకువీరులు లీక్‌ చేసిన సమాచారం ప్రకారం ఆర్జే చైతూ ఎలిమినేట్‌ అయ్యాడట! ఈవారం కెప్టెన్సీ టాస్క్‌లో సత్తా చూపి కెప్టెన్‌గా అవతరించిన చైతూకి ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేకపోయిందని తెలుస్తోంది.

Advertisement

చైతూకి బ‌య‌ట నుండి ఫుల్ స‌పోర్ట్ ఉంది. ఆర్జే కాజల్‌, యాంకర్‌ శ్రీముఖి, నేహాచౌదరి సహా పలువురు సెలబ్రిటీల నుంచి మద్దతు ఉన్నప్పటికీ అతడికే తక్కువ ఓట్లు పడ్డట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో శివ, చైతూ ఉండగా చివరికి ఆర్జేకే అతి తక్కువ ఓట్లు పడటంతో అతడిని పంపించేసినట్లు కనిపిస్తోంది. వారియర్స్‌ను ముప్పులు తిప్పలు పెట్టిన చైతూ నిజంగానే ఎలిమినేట్‌ అయ్యాడా? చివరి నిమిషంలో మరెవరైనా హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారా? అన్నది రేపు తేలనుంది. బిగ్ బాస్ మూడో వారం చివరికి చేరింది. మొదటి రెండు వారాల్లో ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు లేడీ కంటెస్టెంట్లు ఇంట్లో నుంచి ఎలిమినేట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.

Bigg Boss OTT Telugu House from week Rj Chaitu Eliminate

Advertisement

Bigg Boss OTT Telugu : ఎలిమినేష‌న్ లీక్..

ఆ సంగతి పక్కన పెడితే ఇక ఈ వారం ఏకంగా ఎలిమినేషన్ కోసం 12 మంది నామినేషన్ లిస్ట్ లోకి రప్పించడం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి 12 మందిని డేంజర్ జోన్ లో పడేశారు. ఒక విధంగా ఎక్కువ స్థాయిలో ఓటింగ్ రావడం కోసం బిగ్ బాస్ ఈ విధంగా స్ట్రాటజీ అమలు చేశారని ప్రచారం జరిగింది. ఈ వారం డేంజర్ జోన్ లో ఉన్న 12 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది చర్చనీయాంశంగా మారింది. గేమ్ లో ఎంత జెన్యూన్ గా ఉన్నా సోషల్ మీడియా ఫాలోయింగ్ వల్లే ఓటింగ్ అనేది జరుగుతోంది. ఎంత ఫాలోవర్స్ ఉన్నా ఫాలోవర్స్ ఉన్న వాళ్లు సేఫ్ అవుతున్నారా ? అంటే లేదంటే చెప్పాలి. ఎవరూ ఊహించని విధంగా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోతున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి