Home » Entertainment » Bigg Boss Priya Enjoys In Pub
Entertainment

Bigg Boss Priya : వామ్మో పార్టీలంటూ పబ్బులో బిగ్ బాస్ ప్రియ చిందులు.. అక్కడా అలాంటి డ్రెస్సే?

Authored By
aruna
The Telugu News | Published on: August 11, 2022, 3:20 pm
Advertisement

Bigg Boss Priya : బిగ్ బాస్ షో అనేది అందరికీ ఓ ఇమేజ్‌ను తీసుకొస్తుంది. అది మంచిదా? చెడ్డదా? అని వారి వారి ప్రవర్తనను బట్టి ఉంటుంది. బిగ్ బాస్ ప్రియకు మాత్రం మంచి ఇమేజ్ ఏర్పడింది. బిగ్ బాస్ ప్రియ తన గ్లామర్‌తో మరింత మందిని ఆకట్టుకుంది. ప్రియా ఆంటీ అంటూ ఆమెను సరదాగా పిలుస్తుంటారు నెటిజన్లు. బిగ్ బాస్ షోకు వచ్చాక ప్రియ క్రేజ్ మరింత పెరిగింది. వీజే సన్నీతో గొడవ మరింత ఫేమస్ అయింది. సన్నీ, ప్రియల ట్రాక్ బాగానే వర్కవుట్ అయింది. కావాలనే సన్నీతో గొడవలు పెట్టుకోవడం, వారిద్దరి మధ్య ఏదో ఒక సందర్భంలో గొడవలు జరగడం, వాటితో ఈ ఇద్దరి మీదే ఎపిసోడ్ జరుగుతూ ఉండేది.

Advertisement

అయితే చివరకు ప్రియ వెళ్లే సమయంలోనే సన్నీతో కాస్త సఖ్యత ఏర్పడింది. ఈ ఇద్దరూ కలిసిపోయారు. కానీ అదే వారం ప్రియ ఎలిమినేట్ అయింది. చెంప పగిలిపోద్ది అని వీజే సన్నీకి ప్రియ వార్నింగ్ ఇవ్వడం, పదే పదే అదే మాటను రిపీట్ చేయడంతో ఆమె మీద నెగెటివ్ ఇమేజ్ పడింది. దీంతో ఎలిమినేషన్ వరకు రావాల్సి వచ్చింది. అయితే ప్రియ బయటకు వచ్చాక సన్నీతో కలిసి బాగానే సందడి చేసింది.

Bigg Boss Priya Enjoys in Pub

Advertisement

ఈ ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులు ఇచ్చారు. లోపల జరిగిందంతా మరిచిపోండని తమ తమ అభిమానులకు చెప్పుకొచ్చారు. ఇక ప్రియ ఎప్పుడూ కూడా హద్దులు దాటి దుస్తులు ధరించలేదు. నిండైన వస్త్రాదారణతో ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె పబ్బులో ఎంజాయ్ చేసింది. చిందులు వేసింది. అయితే అక్కడా కూడా నిండుగా పంజాబీ డ్రెస్సులోనే కనిపించింది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి