Bigg Boss priyanka satires on jaswanth
Bigg Boss Priyanka : బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమం కొద్ది రోజుల క్రితం ముగిసిన తెలిసిందే. షో తర్వాత కంటెస్టెంట్స్ సోషళ్ మీడియాలో, టీవీ షోలలో తెగ సందడి చేస్తున్నారు. తాజాగా ఐదు సీజన్స్‌కి సంబంధించి కంటెస్టెంట్స్ అందరు ఐదు జోడీలుగా బిబీ జోడీ అనే షోలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, ఇందులో అనేక ఆసక్తికర అంశాలు నెటిజన్స్ ని అలరిస్తున్నాయి. సోహెల్‌కి అరియానా కిస్ ఇవ్వగా, ప్రియాంక సింగ్ అయితే జస్వంత్ ని పులిహోర అంటూ ఆడుకుంది. అందరు బిగ్ బాస్ కి ట్రోఫీ కోసం వస్తే నువ్వు అమ్మాయిలని గెలుచుకోవడానికి వెళ్లాడు. నిజంగా నీ అంత పులిహోర గాడు ఇంకొకడు ఉండడు అని అందరు ముందు అనేసింది ప్రియాంక.
పులిహార కలుపుతూ చాలా మంది అమ్మాయిలని ఫ్లర్ట్‌చేశావు. అలానే నన్ను ఫ్లర్ట్ చేశావు. అలా నేను కూడా పడిపోయా అంటూ ప్రియాంక జెస్సీకి పులి హోర పొట్లం ఇచ్చింది. మొత్తానికి ఈ సన్నివేశాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. బిగ్ బాస్ జోడీ ఈవెంట్ పేరుతో స్టార్ మాలో అన్ లిమిటెడ్ ఎంటర్టన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యారు బిగ్ బాస్ కంటెస్టెంట్లు. వచ్చే ఆదివారం ఫిబ్రవరి 13 సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుండగా,ఈ ఎపిసోడ్ పెద్ద హిట్ అయ్యేలా కనిపిస్తుంది.ఇక జెస్సీ విషయానికి వస్తే.. అతనో ఫ్యాషన్ డిజైనర్.. ర్యాంప్ వాకర్..
Bigg Boss priyanka satires on jaswanth
అలాగే ర్యాంప్ వాకింగ్‌లో స్పెషల్ ట్రైనర్ అని చెప్తూ అతనితో స్టేజ్‌పైనే ర్యాంప్ వాకింగ్ చేయించారు.అయితే జెస్సీ అనే ఈ కొత్త కుర్రాడికి పెద్ద హిస్టరీనే ఉంది.. ఇతని అసలు పేరు జస్వంత్ పడాల.. మనోడిది బెజవాడ. చూడ్డానికి బాలీవుడ్ హీరోలా అనిపిస్తున్న ఇతగాడు పుట్టి పెరిగింది బెజవాడలోనే. ఫ్యామిలీతో హైదరాబాద్‌లోనే ఉంటారు. ఈ 26 ఏళ్ల జస్వంత్‌కి ఇంకా పెళ్లి కాలేదు.మోడలింగ్.. ఫ్యాషన్.. యాక్టింగ్‌పై మక్కువ పెంచుకున్న జస్వంత్.. తొలుత మోడలింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. బెంగుళూరులో పలు ఫ్యాషన్ షోలలో పాల్గొన్నాడు. అవార్డులను సొంతం చేసుకున్నాడు. మిస్టర్ ఏపీ ట్రెడిషనల్ ఐకాన్‌గా ఎంపిక అయ్యాడు.
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
This website uses cookies.