Home » Entertainment » Bigg Boss Telugu 6 Arjun Kalyan Elimination Topic Now
Entertainment

Bigg Boss Telugu 6 Arjun : అర్జున్ ఎలిమినేట్ కావ‌డంపై అంత మోసం జ‌రిగిందా?

Authored By
Sam C
The Telugu News | Updated on: October 24, 2022 12:29 pm
Advertisement

Bigg Boss Telugu 6 Arjun : బిగ్ బాస్ సీజ‌న్ 6 ఎంత ర‌సవ‌త్త‌రంగా మారుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ముఖ్యంగా ఎలిమినేష‌న్ స‌మ‌యంలో ఎవ‌రు ఎప్పుడు ఎలిమినేట్ అవుతార‌న్న‌ది ఊహించ‌డం క‌ష్టంగా మారింది. బిగ్ బాస్ ఇప్పటికే ఏడు వారాలు పూర్తయ్యాయి. హౌజ్ లో నుంచి ఏడో వారం అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అయ్యాడు. మ‌నోడు ఇంకొన్ని రోజులు ఉంటాడ‌ని అంద‌రు అనుకున్నా కూడా ఊహించ‌ని విధంగా ఎలిమినేట్ అయ్యాడు. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేట్ అవ్వడంతో శ్రీసత్య ఎమోషనల్ అయింది. శ్రీసత్య ఏడవడంతో అర్జున్ కళ్యాణ్ కూడా ఏడ్చాడు. అర్జున్ బిగ్‌బాస్‌ స్టేజిపై మాట్లాడుతూ.. నేను బిగ్‌బాస్‌ రావడానికి మెయిన్ కారణం శ్రీసత్యనే అని చెప్పాడు.

Advertisement

బిగ్‌బాస్‌ మొదలవ్వక ముందు శ్రీసత్యకి నేను ఒక సినిమా ఆఫర్ చేశాను. డేట్స్ లేవు, చెయ్యను అని చెప్పింది. ఎందుకు అని అడిగితే బిగ్‌బాస్‌ కి వెళ్తున్నాను అని చెప్పింది. దీంతో నేను కూడా బిగ్‌బాస్‌ కి అప్లై చేయడంతో అదృష్టం బాగుంది వచ్చింది. నాకు బిగ్‌బాస్‌ ఆఫర్ రాగానే ఇంట్లోవాళ్ళకి చెప్పకుండా మొదట శ్రీసత్యకే ఫోన్ చేసి చెప్పాను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీనికి శ్రీసత్య స్పందిస్తూ అసలు ఈ విషయం ఇప్పటిదాకా నాకు తెలీదు అని చెప్పింది. అర్జున్ ఎలిమినేషన్ అనేది నిజంగా అన్యాయం అనే చెప్పాలి..ఎందుకంటే అర్జున్ తో పోలిస్తే అత‌ని క‌న్నా వీక్ కంటెస్టెంట్స్ చాలా మంది ఉన్నారు.

Bigg Boss Telugu 6 Arjun kalyan elimination topic now

Advertisement

Bigg Boss Telugu 6 Arjun : మోసం జ‌రిగిందా?

కాని వారంద‌రిని సేవ్ చేసి అర్జున్‌ని ఎలిమినేట్ చేయ‌డం మోసం అని కొంద‌రు అంటున్నారు. గడిచిన సీజ‌న్స్ లో సోషల్ మీడియా వెబ్ సైట్స్ లో జరిగే పోలింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అయ్యిపోతున్నారు అనేది చాలా తేలికగా అంచనా వేసేవారు.ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఎలిమినేషన్స్ కూడా జరిగేవి. కాని ఇప్పుడు ఊహకందని ఎలిమినేషన్స్ ని పెడుతున్నారు . వాస్తవానికి వచ్చిన వోటింగ్ ప్రకారం ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి మెరీనా ఎలిమినేట్ అవ్వాలి. కాని ఆమెని సేవ్ చేసి అర్జున్‌ని బ‌య‌ట‌కు పంపారు. ఇది నిజంగా చీటింగ్ అని కొంద‌రు చెప్పుకొస్తున్నారు.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి