Ram Gopal Varma : అక్టోబర్ 23వ తేది అభిమానులకి పండగే. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. . తెలుగు రాష్ట్రాలతో పాటు మన దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఆఖరికి ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లోనూ ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా కనిపించింది. అయితే అభిమానం ఎంతైనా ఉండొచ్చు పరవాలేదు. కానీ అభిమానుల హంగామా లైన్ క్రాస్ చేసి.. రచ్చ చేస్తే.. ఇబ్బందులు తప్పవు. చాలా సార్లు ఆ హద్దులు దాటే అభిమానంతో సంబంధం లేని వారి సైతం ఇబ్బందులు పడుతున్నారు.
ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలో ఇటీవల మూసేసిన వెంకట్రామ థియేటర్‌లో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అందులో బిల్లా స్పెషల్ షో వేయించారు. ఈ షోకి ప్రభాస్ ఫ్యాన్స్ భారీ ఎత్తున హాజరు అయ్యారు. అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు థియేటర్ లో రచ్చ రచ్చ చేశారు. సినిమా చూస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్‌లో బాణసంచా పేల్చారు. ఈ సందర్భంగా అనుకోకుండా సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో థియేటర్ మొత్తం మంటలు అంటుకున్నాయి. వెంటనే తేరుకున్న ప్రభాస్ అభిమానులు మరియు థియేటర్ యాజమాన్యం ఆ మంటలను ఆర్పేశారు. మొత్తానికి ప్రభాస్ పుట్టనరోజు నాడు పెద్ద ప్రమాదం తప్పింది.
అయితే, సినిమాని షో మధ్యలో ఆపినందుకే కొందరు ఫ్యాన్స్ మంటలు పెట్టారని టాక్ నడుస్తోంది. థియేటర్ లో ప్రభాస్ అభిమానులు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ఓ వీడియోని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ చర్యని ఖండించారు. ఇది దీపావళి వేడుక కాదు. తన సినిమా తెరపై నడుస్తుండగా, థియేటర్‌ని తగలబెట్టి సంబరాలు చేసుకోవడం ప్రభాస్ అభిమానుల పిచ్చ చర్య అంటూ పోస్ట్ పెట్టారు. అ తర్వాత ఇది ప్రభాస్ స్టయిల్ ఆఫ్ దీపావళి సెలబ్రేషన్ అంటూ మరో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు వైరల్‌గా మారాయి. దీనిపై రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా పలువురు హీరోల అభిమానులు ఇలాంటి రచ్చ చేసిన విషయం తెలిసిందే.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.