Bigg Boss Telugu 7 contestent shivaji latest news
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా శివాజీ దూసుకెళుతున్నారు. అతడు హౌస్ లో అందరి కంటే సీనియర్ గా ఉన్నాడు. తన ఆటతోపాటు సలహాలు, సూచనలు ఇస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఇంటికి పెద్దదిక్కు ఎలా ఉండాలో అలానే ఉంటున్నాడు శివాజీ. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ లకు గురువుగా వ్యవహరిస్తున్నాడు. అందులోనూ పల్లవి ప్రశాంత్ కోసం ఏం చేయడానికి అయినా రెడీగా ఉంటున్నారు శివాజీ. అందుకే ఓటింగ్ లో కూడా శివాజీ టాప్ పొజిషన్ లో ఉన్నారు. అయితే రీసెంట్ గా అతను హౌస్ లో టాస్క్ ఆడుతున్నట్టు అతడి భుజానికి గాయం అయిన సంగతి తెలిసిందే.
అందుకే అతడిని కొన్ని రోజులు బయటికి పంపించి స్కానింగ్ కూడా తీశారు. ఇక టెస్టులు చేసిన తర్వాత వైద్యులు ఓకే అని చెప్పడంతో అప్పుడు అతడిని మళ్ళీ హౌస్ లోకి తీసుకున్నారు. అయితే పూర్తిగా కోలుకోలేదు. కాబట్టి శివాజీ టాస్కులకు దూరంగానే ఉంచుతున్నాడు బిగ్ బాస్. టాస్కులు పెద్దగా ఆడకపోయినా సరే శివాజీ ఓ రేంజ్ లో ఆడుతున్నాడు. కాగా అతడు ఇంకా కోలుకోలేదు కాబట్టి అనారోగ్య సమస్యల కారణంగా సీజన్ సెవెన్ నుంచి మధ్యలోనే తప్పుకోవాల్సి వస్తుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
Bigg Boss Telugu 7 contestent shivaji latest news
ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్ లో ఎక్కి ఎక్కి ఏడ్చాడు శివాజీ. అది కాస్త నెట్టింటా వైరల్ గా మారింది. ఇక తన ముందు కూర్చున్న ప్రిన్స్ యావర్ ను పట్టుకొని ఏడ్చాడు. బిగ్బాస్ లో నీకోసం, పల్లవి ప్రశాంత్ కోసమే ఉన్నాను రా లేకపోతే ఎప్పుడో వెళ్లిపోయే వాడిని అని ఎమోషనల్ అయ్యారు. ఇంతలోనే అక్కడికి పల్లవి ప్రశాంత్ వచ్చాడు. దీంతో ప్రశాంత్ ని పట్టుకొని శివాజీ ఎమోషనల్ అయ్యారు. నా బిడ్డల మీద ఒట్టు రా నేను మీకోసమే ఉన్నాను రా లేదంటే నాగార్జునను రిక్వెస్ట్ చేసి ఎప్పుడో బయటికి వెళ్లి పోయేవాడిని అని చెప్పాడు. దాంతో పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ ఇద్దరు కలిసి శివాజీని ఓదార్చారు. ఆ తర్వాత ఇది పెద్ద సీన్ అవుతుందని భావించి ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మొదటినుంచి పల్లవి ప్రశాంత్ కి సపోర్టుగా శివాజీ ఉంటున్నారు.
Central Govt : ప్రస్తుతం భారత్ - పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్…
IPL 2025 Postponed : భారత్, పాక్ దేశాల మధ్య యుద్ధం కారణంగా ఐపీఎల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నట్టు…
Army Jawan Murali Naik : భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ‘ఆపరేషన్ సిందూర్’కు ప్రతీకారంగా పాకిస్థాన్ సైన్యం…
Brain Healthy : మీ మెదడు మీ సాధారణ శ్రేయస్సు, జీవన నాణ్యతలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. శారీరక…
Good News : భారత ప్రభుత్వం 2025 మే 5న రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స…
Sugarcane Juice : వేసవి వేడి శక్తిని హరించడం ప్రారంభించినప్పుడు, ప్రకృతి దాని రిఫ్రెషింగ్ విరుగుడు - చెరుకు రసాన్ని…
Funeral : హిందూ సంప్రదాయంలో మాత్రమే కాదు, ఇతర మత సంప్రదాయంలో కూడా మనిషి చివరి జర్నీ పలు రకాల…
Fingernails Health : మీ వేలి గోళ్లు వాటి రంగు, ఆకారం, ఆకృతి ద్వారా మీ ఆరోగ్య స్థితికి సూచనలను…
This website uses cookies.