Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ రచ్చ.. కన్నడ బ్యాచ్ డామినేషన్ ఏంటి..!
Bigg Boss Telugu 8 : సోమవారం వచ్చిందంటే బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ రచ్చ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారంలో జరిగినవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకొని మరీ నామినేట్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఈ వారం నామినేషన్స్ టాస్క్ మొత్తం గొడవలతో సాగింది. ఇక నామినేషన్స్‌లో ఆరుగురు కంటెస్టెంట్స్ నిలిచారు. గౌతమ్, ఆవినాష్, విష్ణుప్రియ, యష్మి, తేజ, పృథ్వీ నామినేషన్స్‌లో ఉన్నారు. ఓ పెయింటింగ్‌ను కలర్‌తో పాడుచేస్తూ ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో వారి పేరు చెప్పమని బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌కు టాస్క్ ఇచ్చాడు. టేస్టీ తేజని టార్గెట్ చేసి కన్నడ బ్యాచ్ గట్టిగా ఇచ్చి పడేశారు.
గత వారం సిల్లీ నామినేషన్ వేసిన తేజ.. ఆతరువాత గుడ్డు టాస్క్ లో ఏం చేశాడో అందరు చూశారు. అయితే ఈ విషయంపై తేజను నామినేట్ చేయడం పెద్ద తప్పేమి కాదు. కాని అతనిలో చాలా ప్రస్టేషన్లు ఉన్నాయి. హౌస్ అంతా తనను వరస్ట్ ప్లేయర్ అన్నారు. ఇంట్లో వాళ్లు హౌస్ లోకి రాకుండా బిగ్ బాస్ పనిష్ చేశారు. ఈ ప్రస్టేషన్ లో నిఖిల్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆతరువాత ఫృద్వీతో.. ఆతరువాత యష్మితో.. ఇలా వరుసగా వాదోపవాదాలు.. అరుపులతోబిగ్ బాస్ హౌస్ దద్దరిల్లిపోయింది. అంతే కాదు నిఖిల్ తేజాను నామినేట్ చేయగా.. తేజ యష్మిని నామినేట్ చేశారు. ఆతరువా గౌతమ్ పృధ్వీని నామినేట్ చేయగా.. గౌతమ్ చెప్పిన పాయింట్స్ ను అలా ఊది పడేశాడు పృధ్వీ. అందులో పసలేదని.. ఫూక్ నామినేషన్ అనిప్రూ చేశాడు. కవర్ చేసుకోలేక గౌతమ్ అది నా అభిప్రాయం అంటూ బుకాయించాడు.
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ రచ్చ.. కన్నడ బ్యాచ్ డామినేషన్ ఏంటి..!
ఇక పృధ్వీ మాత్రం అవినాష్ ను నామినేట్ చేస్తూ.. సిల్లీ రీజన్స్ ను చెప్పాడు. చీఫ్ గా ఉన్నప్పుడు ఫుడ్ లేట్ అయ్యిందని. గేమ్ లో సంచాలక్ గా ఫెయిల్ అయ్యావని. సో ఈ విషయంలో అవినాష్ కూడా డిపెన్స్ చేసుకున్నాడు. ఎందుకంటే పృధ్వీ అండ్ బ్యాచ్ అంటే ఇష్టం లేని కొంత మంది సపరేట్ అయ్యారు.స్మోకింగ్ జోన్‌లో స్మోక్ చేసినందుకు నిఖిల్‌ను నామినేట్ చేశావు కదా పాత గొడవల్ని మళ్లీ గెలికాడు. పృథ్వీని నామినేట్ చేసినందుకు…ఇప్పుడు నన్ను నామినేట్ చేస్తున్నావా..కలిసే గేమ్ ఆడుతున్నారా అంటూ నిఖిల్‌ను నిలదీశాడు. మేము కలిసి ఆడుతున్నామని నీకు చెప్పామా అంటూ తేజపై పృథ్వీ ఫైర్ అయ్యాడు.ఆ తర్వాత తేజ వంతు రాగా…అతడు యష్మిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత పృథ్వీ అవినాష్‌ను నామినేట్ చేశాడు. చీఫ్‌గా, సంచాలక్‌గా ఫెయిలయ్యావని రీజన్ చెప్పాడు. రోహిణి…విష్ణుప్రియను నామినేట్ చేసింది. చీఫ్ కంటెండర్ అయ్యాకా…నాకు సపోర్ట్ చేస్తాననిచెప్పి పృథ్వీకి సపోర్ట్ చేశావని రోహిణి అనగా…నాకు పృథ్వీనే ఎక్కువ అని విష్ణుప్రియ బదులిచ్చింది.
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
This website uses cookies.