Beer : నిజంగానే బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా...? దీనిలో నిజం ఎంత ఉంది... పూర్తి వివరాలు మీకోసం...??
Beer : ఆల్కహాల్ అనేది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ విషయం మందు బాటిల్ పై కూడా రాసి ఉంటుంది. అయినా కూడా ఈ అలవాటును మార్చుకునేందుకు మందు బాబులు అస్సలు ఇష్టపడరు. అయితే బీర్ తాగితే ఏమి కాదు,పైగా ఆరోగ్యానికి మంచిది అని కొంతమంది భావిస్తూ ఉంటారు. అలాగే అప్పుడప్పుడు ఒక బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే అని తమకు తాము సర్ది చెప్పుకుంటారు. నిజంగానే బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా.? దీనిలో ఎంత నిజం ఉన్నది.? దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం…
ప్రతిరోజు బీరు తాగటం వలన మెదడు సామర్థ్యం అనేది దెబ్బతింటుంది అని అంటున్నారు నిపుణులు. అయితే బీరులో ఉండే ఆల్కహాల్ న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరుకు అడ్డంకి గా మారుతుంది అని అంటున్నారు నిపుణులు. దీని కారణం చేత జ్ఞాపక శక్తి అనేది తగ్గిపోతుంది. అంతేకాక బీరును ప్రతిరోజు తాగితే మానసిక సమస్యలకు కూడా దారి తీస్తుంది. అలాగే ఆల్కహాల్ అనేది డిప్రెషన్ కు కూడా దారి తీస్తుంది అని అంటున్నారు. అంతేకాక సెరటోనిన్ మరియు డొపమైన్ మధ్య నియంత్రణ పట్టాలు తప్పేలా కూడా చేస్తుంది. దీంతో ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఇకపోతే బీర్ ను అధికంగా తీసుకోవడం వలన ఆకలి కూడా పెరుగుతుంది. దీని వలన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇది బరువు పెరగటానికి కారణం అవుతుంది అని అంటున్నారు నిపుణులు…
Beer : నిజంగానే బీరు తాగితే ఆరోగ్యానికి మంచిదా…? దీనిలో నిజం ఎంత ఉంది… పూర్తి వివరాలు మీకోసం…??
బీరు తాగటం వలన మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాగా పెరుగుతుంది. అయితే ఇది దీర్ఘకాలంలోనే అల్జీమర్స్ కు దారితీస్తుంది అని అంటున్నారు. అలాగే కొంతమంది బీరు తాగితే మంచి నిద్ర పడుతుంది అని భావిస్తారు. అయితే ముందుగా నిద్ర వచ్చినట్టు అనిపించిన ఆ తర్వాత మాత్రం నిద్రకూ ఎంతో ఆటంకం కలుగుతుంది. దీంతో డిహైడ్రేషన్ మరియు అతిగా మూత్ర విసర్జన చేయడం వలన నిద్రలేమికి కారణం అవుతుంది. అలాగే ప్రతిరోజు బీరు తాగే వారిలో గుండెపోటు మరియు లివర్ కు సంబంధించిన సమస్యల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంటున్నారు. అలాగే ప్రతిరోజు బీర్ తాగటం వలన శరీరం అనేది డిహైడ్రేషన్ కు గురవుతుంది. దీని కారణం చేత చర్మం అనేది పొడిబారి కాంతి మరియు నిగారింపు కోల్పోతుంది. అంతేకాక ముఖం కూడా ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. ఇకపోతే వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా కనిపిస్తాయి అని అంటున్నారు నిపుణులు
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
This website uses cookies.