Janasena : మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగించే జీవో నెం.217ను రద్దు చేయాలని గత ప్రభుత్వంని టీడీపీ నాయకులు, జనసేన నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 2800 సొసైటీల పొట్టకొట్టే, లక్షలాది మంది మత్స్యకారులు రోడ్డునపడేలా జగన్‌రెడ్డి ప్రభుత్వం 217 జీవోను రూపొందించిందన్నారు. అనాదిగా చెరువుల్లో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్న మత్స్యకారులను పట్టించుకోకుండా టెండర్లు పిలిచి దళారులకు దోచిపెట్టేలా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే ఆ జీవోని రద్దు చేస్తామంటూ ఎన్నికలకి ముందు కూటమి ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన అనేక విధానాలను మారుస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఈసారి మత్స్యకారులకు ఊరట నిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్య కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్న 217 జీవో రద్దు చేయాలని నిర్ణయించింది. మత్స్యకారులను ఇబ్బంది పెట్టే ఈ జీవోను రద్దు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారు. అలానే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి వస్తే ఆ జీవోని తప్పక రద్దు చేస్తామని అన్నారు. అప్పుడు అచ్చెన్నాయుడు రద్దు చేస్తామని అనగా, ఇప్పుడు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ బడ్జెట్‌లో దీని గురించి పూర్తి క్లారిటీ ఇవ్వడంతో మత్స్యకారులు సంతోషంగా ఉన్నారు.
ఇక దీనిని జనసేన నాయకులు తమ విజయంగా చెప్పుకుంటున్నారు.అప్పట్లో జగన్ ఈ జీవోని ఎంత సమర్ధించుకున్నా చాలా విమర్శలు వచ్చాయి.వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన 217 జీవో అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. ఈ జీవో కారణంగా మత్స్యకారులు సొంత ఊర్లల్లోని చెరువుల్లో చేపలు పట్టే హక్కును కోల్పోతారని విమర్శలు వచ్చాయి. ఈ జీవో ప్రకారం చేపలు పట్టడానికి ప్రభుత్వం టెండర్లు పిలిచేది. టెండర్లు దక్కించుకున్నవారికే చేపలు పట్టే హక్కు ఉండేది. దీంతో అప్పట్లో ఈ జీవో మీద ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. 217 జీవో ద్వారా మత్స్యకారుల ఉపాధి దెబ్బతినడమే కాకుండా వారి ఉనికికి కూడా భంగం కలుగుతుందని విపక్షాలు ఆరోపించాయి.అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం మాత్రం అన్ని చెరువులకు 217 జీవో వర్తించదని.. వంద ఎకరాల కంటే ఎక్కువ ఉన్న చెరువులకే జీవో వర్తిస్తుందని స్పష్టం చేసింది.
Karthika Masam : కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ కార్తీక మాసం లో చాలామంది…
GAIL Recruitment : గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత…
Jupiter : వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశికి సంచారం చేస్తూ…
AUS vs IND : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25 భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య…
BSNL : బీఎస్ఎన్ఎల్ నేషనల్ Wi-Fi రోమింగ్ సర్వీస్ను ప్రారంభించింది. BSNL యొక్క నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ఇప్పుడు…
నటీనటులు : వరుణ్ తేజ్ Varun Tej , మీనాక్షి చౌదరి Meenakshi Chaudhary, నోరా ఫతేహి Nora Fatehi…
Ycp : ఏపీలో కూటమి పార్టీ అధికారంలోకి రావడం మనం చూశాం. మూడు పార్టీలు కలిసి పోటీ చేయడంతో మంచి…
Chandrababu Naidu : ఏపీ అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు జరగగా, ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు…
This website uses cookies.