
Bigg Boss Telugu 8 : ఆ కంటెస్టెంట్‌కి అలా బ్రేక్ పడింది.. మూడు నెలల్లో బాగానే సంపాదించినట్టున్నాడు.!
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్ 13వ వారం రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. ముందు రోజు టేస్టి తేజ ఎలిమినేట్ కాగా, ఆ తర్వాత పృథ్వీరాజ్ శెట్టిని ఎలిమినేట్ చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఎలిమినేషన్ ప్రక్రియలో పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయినట్టు హోస్ట్ నాగార్జున తెలిపారు. విష్ణుప్రియాతో కలిసి ఫైనల్ ఎలిమినేషన్ ప్రక్రియలో పాల్గొనగా, పృథ్వీరాజ్ ఈ వారం బిగ్ బాస్ హౌజ్‌ని వీడుతున్నట్టు నాగ్ వెల్లడించారు. అయితే పృథ్వీకంటే ముందుగా ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ తెలుగు 8 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ టేస్టీ తేజ 2 నెలలకు గానూ రూ. 12 లక్షలు లేదా రూ. 32 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం .
Bigg Boss Telugu 8 : ఆ కంటెస్టెంట్‌కి అలా బ్రేక్ పడింది.. మూడు నెలల్లో బాగానే సంపాదించినట్టున్నాడు.!
ఇక బిగ్ బాస్ హౌజ్‌లో యారగంట్‌గా, రౌడీలా బిహేవ్ చేసిన పృథ్వీరాజ్ హౌజ్‌లో ఉన్నన్ని రోజులు నానా రచ్చ చేశారు. బిగ్ బాస్ 8 తెలుగులోకి అడుగుపెట్టిన పృథ్వీరాజ్ హౌజ్‌లో దాదాపుగా 91 రోజులు ఉన్నాడు. అంటే, సరిగ్గా 3 నెలల (13 వారాలు) వరకు హౌజ్‌లో అలరించాడు. బిగ్ బాస్ తెలుగు 8లో పాల్గొన్నందుకు పృథ్వీ రోజుకు రూ. 18,572 పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అంటే, వారానికి రూ. లక్షా 30 వేలు. ఈ లెక్కన 13 వారాలకు పృథ్వీరాజ్ సుమారుగా రూ. 16 లక్షల 90 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఎలిమినేట్ అయిన బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చిన పృథ్వీరాజ్… తన జర్నీ చూసుకుని ఎమోషనల్ అయ్యారు. అనంతరం నాగ్.. హౌజ్‌లో ఎవరు సూపర్ హిట్, ఎవరు సూపర్ ఫ్లాప్ అని చెప్పాలన్నారు.
అందులో నిఖిల్, విష్ణు ప్రియా, నబీల్‌లకు సూపర్ హిట్ ట్యాగ్ ఇచ్చాడు. రోహిణి, అవినాష్‌లకు సూపర్ ఫ్లాప్ ట్యాగ్ ఇచ్చాడు. వీరిద్దరు నామినేషన్‌లోకి రావాలని, ఆడియెన్స్ జడ్జ్ మెంట్ తీసుకోవాలన్నారు. అవినాష్ ఇప్పటికే ఎలిమినేట్ కావాల్సి ఉందని, కానీ ఎవిక్షన్ షీల్డ్ వల్ల సేవ్ అయ్యాడని, ఇప్పుడు ఫైనల్‌కి వెళ్లాడని, ఇంకా బాగా ఆడాలని తెలిపారు పృథ్వీరాజ్. అనంతరం ఓ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. తాను ఎవరికి ఓట్ వేస్తానో తెలిపారు. నిఖిల్, విష్ణు ప్రియా, నబీల్, ప్రేరణలకు తన ఓటు అని ప్రకటించాడు. గౌతమ్, అవినాష్, రోహిణి వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు కాబట్టి వారికి వేయను అన్నట్టుగా చెప్పాడు. పృథ్వీ.. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల విషయంలో తన వివక్షని చూపించాడు. వారికి ఓటు వేయనని ఓపెన్‌గానే ప్రకటించాడు.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.