bigg boss ott final list
Bigg BossTelugu OTT : ఉత్తరాది ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ ని అమితంగా ఆదరిస్తున్నారని విషయం సీజన్ 5 కి వచ్చిన రేటింగ్ తో క్లారిటీ వచ్చేసింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ కంటే కూడా అధికంగా తెలుగు బిగ్ బాస్ ని ప్రేక్షకులు చూస్తున్నట్లుగా స్వయంగా స్టార్ మా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు బిగ్ బాస్ ను అమితంగా ఆదరిస్తున్న నేపథ్యంలో కొత్త ఫార్మాట్ లో కూడా తీసుకు రావడానికి నిర్వాహకులు సిద్ధం అయ్యారు. నాగార్జున హోస్టుగా బిగ్ బాస్ ఓ టీ టీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రోమోను రామోజీ ఫిలిం సిటీ లో షూట్ చేసినట్లు గా స్టార్ మా మరియు హాట్ స్టార్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఏ క్షణంలో అయినా ఆ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇక ఈ ఓటీటీ బిగ్ బాస్ లో మాజీ కంటెస్టెంట్స్ ఏడుగురు ఉంటారనేది గత కొన్ని రోజులుగా ప్రథానంగా వార్తలు వస్తున్నాయి. ఏడుగురు కూడా గత సీజన్లో మొదటి నాలుగు ఐదు వారాల్లో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉండబోతున్న ట్లు గా తెలుస్తోంది. వాళ్ళు బిగ్ బాస్ ఆసక్తి తో తక్కువ పారితోషికం తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సోషల్ మీడియా లో పాపులర్ అయిన కొందరిని ఈసారి బిగ్ బాస్ హౌస్ కి తీసుకు రాబోతున్నట్లు గా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన వారి కంటే ఈ సారి ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీలకు ప్రాముఖ్యత ఇస్తున్నారని మొదటి నుంచి కూడా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా సెలబ్రిటీలకు ఎక్కువ అవకాశం ఇవ్వడానికి కారణం ప్రధానంగా వారి పారితోషికం చాలా తక్కువగా ఉంటుంది. వారం కి లక్ష లక్షన్నర అంతకు తక్కువ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
biggboss telugu ott contestants remuneration is very low
అందుకే వారు ఈ షోకి అధికంగా రాబోతున్నారు. బిగ్ బాస్ అంటే చాలా పెద్ద ఫ్లాట్ఫామ్ కనుక కొందరైతే ఫ్రీ గానే వచ్చి కంటెస్టెంట్ గా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అయితే డబ్బులు ఎదురు ఇచ్చిమరీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే నిర్వాహకులు డబ్బులకు కక్కుర్తి పడి తక్కువ పారితోషికం తీసుకుంటారని ఉద్దేశంతో సోషల్ మీడియా సెలబ్రిటీలను ఎంపిక చేస్తున్నట్లు గా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం లో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. కంటెస్టెంట్స్ ఎవరైనా కానీ మంచి ఎంటర్టైన్మెంట్ షో కచ్చితంగా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. గత సీజన్లో మంచి పారితోషికం తీసుకున్న వాళ్ళ కంటే కూడా తక్కువ పారితోషికం తో చేసిన వాళ్లే ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఈ సారి కూడా వాళ్ళ పై నమ్మకం ఉంచడం లో తప్పులేదు.
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.