Bigg Boss Vasanthi : ఇలాగే కంటిన్యూ అయితే.. బయటకి వచ్చేస్తావ్ వాసంతి.. చాలా కేర్ ఫుల్ గా ఉండు తల్లోయి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss Vasanthi : ఇలాగే కంటిన్యూ అయితే.. బయటకి వచ్చేస్తావ్ వాసంతి.. చాలా కేర్ ఫుల్ గా ఉండు తల్లోయి..!

 Authored By jagadesh | The Telugu News | Updated on :23 October 2022,8:00 am

Bigg Boss Vasanthi : బిగ్ బాస్ సీజన్ 6 అంతగా టీఆర్పీ రేటింగ్స్ ను సాధించడం లేదని మీడియాలో రోజురోజుకూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కోట్లు ఖర్చు పెడుతున్నా.. కనీసం సీరియల్స్ కు వచ్చిన టీఆర్పీ కూడా రావడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. సీజన్ 6 ప్రారంభంలో కాస్త స్లోగానే నడిచినా.. ఇప్పుడు హౌస్ లో కావాల్సినంత కాంట్రవర్సీ ఉంది. దీంతో బిగ్ బాస్ 6 ఇప్పుడిప్పుడే రంజుగా మారుతోంది. ప్రేక్షకులను ఆకట్టుకోవడాని బిగ్ బాస్ చాలా సాహసాలే చేస్తున్నాడు అని చెప్పుకోవాలి. ఏం చేసినా ప్రేక్షకులు మాత్రం బిగ్ బాస్ ను అస్సలు పట్టించుకోవడం లేదు.

రకరకాల గేమ్స్ ను ఆడిస్తూ.. కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టడం, ఇంకా ఆసక్తికరంగా మలిచేందుకు బిగ్ బాస్ చాలానే ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఈవారం ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ను కూడా బిగ్ బాస్ రద్దు చేశాడు. దానికి కారణం.. చాలా నిర్లక్ష్యంగా కెప్టెన్సీ టాస్క్ ను ఆడారని రద్దు చేస్తాడు. ఆ తర్వాత ఇంటి ఫుడ్ మొత్తాన్ని దొంగలించేలా చేసిన బిగ్ బాస్.. హౌస్ మెట్స్ అంతా ఆకలితో అలమటించేలా చేస్తాడు. ఫుడ్ అంతా తిరిగి కావాలంటే.. టగ్ ఆఫ్ వార్ గెలవాల్సిందే అంటూ పలు టాస్క్ లను మళ్లీ కంటెస్టెంట్లతో ఆడించాడు బిగ్ బాస్. అయితే.. ఇందులో ఓడిపోయిన టీం నుంచి ఒకరు డైరెక్ట్ గా ఎలిమినేట్ అయ్యేందుకు నామినేట్ అవుతారు అని బిగ్ బాస్ చెబుతాడు.

Bigg Boss Vasanthi may be eliminated if she really does not play the game

Bigg Boss Vasanthi may be eliminated if she really does not play the game

Bigg Boss Vasanthi : తిండి కావాలంటే టగ్ ఆఫ్ వార్ గెలవాల్సిందే?

ఓడిపోయిన టీమ్ సభ్యులు ఓటింగ్ ద్వారా వాసంతిని నేరుగా నామినేట్ చేస్తారు. ఎందుకంటే తన ఆటతీరు సరిగ్గా లేదని చెబుతారు. అంతే కాదు.. ఈసారి డిజాస్టర్ కంటెస్టెంట్ ఎవరు అని కంటెస్టెంట్లను అడిగితే అందరూ వాసంతికే ఓట్లేశారు. అంటే.. వాసంతి కేవలం గ్లామర్ కు తప్పితే ఆట ఆడటానికి పనికి రాదా. తను కేవలం తన అందం వల్లనే ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో సర్వైవర్ అయిందా అనే అనుమానాలు లేవనెత్తుతున్నారు ప్రేక్షకులు. ఓవైపు నామినేషన్ లో, మరోవైపు డిజాస్టర్ కంటెస్టెంట్ అవడంతో వాసంతికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలా.. గేమ్ ఆడకుండా.. కేవలం గ్లామర్ కే పరిమితం అయితే.. వాసంతి తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే అని ప్రేక్షకులు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Also read

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి