Bigg Boss winner Sunny : బిగ్ బాస్ సన్నీకి బంపరాఫర్.. అమెరికా అమ్మాయితో పెళ్లి…. రూ.100 కోట్ల కట్నం..!
Bigg Boss winner Sunny : బిగ్ బాస్ షో నుంచి విన్నర్ సన్నీకి రూ.50 లక్షల ప్రైజ్ మనీను చెక్ రూపంలో అందించారు. దీంతో పాటు సువర్ణ కుటీర్ వారి తరఫున రూ.25 లక్షల విలువైన ప్లాట్, అలానే.. 2 లక్షల విలువైన అపాచీ స్పోర్ట్స్ బైక్ ను కూడా సన్నీ గెలుచుకున్నాడు. వీటితో పాటు 105 రోజులు హౌజ్ లో ఉన్నందుకు గానూ ఇచ్చిన పేమెంట్ తో కలుపుకుంటే దాదాపు కోటి రూపాయలకు పైనే గెలుచుకున్నాడు సన్నీ. ఇక డబ్బు సంగతి పక్కన పెడితే అంతకు మించిన కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించాడు. బిగ్ బాస్ హౌజ్ బయటకు వచ్చిన అనంతరం సన్నీ క్రేజ్ మామూలుగా లేదు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో ఉన్న తెలుగువారి నుంచి కూడా నిత్యం సన్నీకి ఫోన్లు మెసేజ్ లు వస్తూనే ఉన్నాయట. అయితే ఇలాగే ఇటీవల ఓ మహిళ కాల్ చేసి సన్నీకి ఊహించని ఆఫర్ ఇచ్చిందట.
ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సన్నీ.. తనకు ఎదురైన ఓ ఆసక్తికర పరిణామాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. రోజూ వందలాది కాల్స్ వస్తుండగా ఇటీవల అమెరికా నుంచి ఉష అనే మహిళా అభిమాని సన్నీకి వీడియో కాల్ చేశారట. సన్నీ ఆమెతో మాట్లాడుతుండగా.. సదరు మహిళ నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా.. సన్నీని అడిగారట. అయితే గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరని ఆయన బదులివ్వడంతో సదరు మహిళ సన్నీకి ఊహించని ఆఫర్ ఇచ్చిందని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. తమ కూతురిని వివాహమాడమని కోరిన ఆ ఉష అనే మహిళ.. తనకు రూ. 100 కోట్ల ఆస్తికి పైగా ఉన్నట్లు చెప్పిందట. మరికొద్ది రోజుల్లో మా అమ్మాయి నిన్ను కలవడానికి ఇండియాకు వస్తుందంటూ.. నీవు ఇంకెవరిని చూడవద్దని కోరిందట.

Bigg Boss winner Sunny got a huge marriage offer from a american fan
Bigg Boss winner Sunny : సన్నీకి రూ. 100 కోట్ల అమెరికా సంబంధం..:.
అయినా మా అమ్మాయిని చూస్తే నువ్వే రివర్స్ కట్నం ఇస్తానంటావు.. ఒక్కసారి చూడు సన్నీ.. నేను సీరియస్‌గానే అడుగుతున్నాని చెప్పిందట. దీనికి బదులుగా… నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలని చెప్పిన సన్నీ.. అతని తల్లి ఆస్తి వంటి వాటిని పరిగణనలోకి తీసుకోదని చెబుతూ సున్నితంగా తిరస్కరించానని సన్నీ చెప్పారు.బిగ్ బాస్ షో అనంతరం విన్నర్ కు ఓ నాలుగైదు షో లు ఒకటి అరా సినిమా అవకాశాలు తప్పితే ఇప్పటివరకు ఎవరికీ పెద్దగా ఒరిగింది ఏమి లేదు. అయితే ఈసారి సన్నీ కి మాత్రం షో లతో పాటు సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి అంటే అతని స్థాయి ఏ రేంజ్‌లో పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. ఏకంగా రూ.100 కోట్ల అమెరికా సంబంధమే వచ్చిందంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.