Bigg Boss Siri shares interesting post
Bigg Boss 5 Siri : తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ముద్దుగుమ్మ సిరి. ఈ అమ్మడు షన్ను తో చేసిన స్నేహం బయట చాలా చర్చలకు తెర తీసింది. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ విషయాల గురించి చర్చ జరిగింది అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ సీజన్ 5 తో అనూహ్యంగా గుర్తింపు దక్కించుకున్న సిరి ముందు ముందు యూట్యూబ్ వీడియో లతో కుమ్మేస్తుందని అంతా భావించారు. టాప్ 5 వరకు వచ్చి గొప్ప విజేతగా నిలిచిన ఆమె కెరీర్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా కాకుండా ఖచ్చితంగా బాగుంటుందని ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు. ఆమె కోసం ప్రస్తుతం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇటీవల కరోనా బారిన పడ్డ సిరి వారం పది రోజులు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యింది.
ఆ సమయంలో ఆమె స్నేహితులు అయిన జెస్సీ మరియు ఇతరులు వెళ్లి ఆమెను దూరంగా ఉండి పరామర్శించారు. కరోనాతో ఆమె బాధ పడ్డ సమయంలో స్నేహితులు ఆమెకు చాలా మద్దతుగా నిలిచారు. ఆ విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. స్వల్ప లక్షణాలతోనే కరోనా నుండి బయట పడ్డ సిరి ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినప్పటి నుండి కూడా సోషల్ మీడియాలో కాస్త సైలెంట్ గా ఉంటూ వచ్చింది. విమర్శలకు భయపడి కాస్త సైలెంట్ గా ఉన్న ఈ అమ్మడు ఎట్టకేలకు రచ్చ మొదలు పెట్టింది.పెళ్లికి సిద్దం అంటూ సిరి గురించి శ్రీహాన్ గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఇద్దరు కూడా చట్టా పట్టాలేసుకున తిరిగారు.
BiggBoss siri after corona in social media
కాని ఇప్పుడు ఇద్దరు కూడా ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చినప్పటి నుండి శ్రీహాన్ తో ఉన్న ఒక్క ఫొటోను కూడా ఆమె షేర్ చేయలేదు. అసలు ఇద్దరి మద్య వ్యవహారం ఏమై ఉంటుందా అంటూ అంతా కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. సిరి హౌస్ లో ఉన్న సమయంలో శ్రీహాన్ చాలా పబ్లిసిటీ చేశాడు. ఆ సమయంలో ఆమెకు మద్దతుగా చాలా పోస్ట్ లు పెట్టాడు. ఆమె పై వస్తున్న ట్రోల్స్ కు కూడా సమాధానం చెప్పాడు. అంత చేసినా కూడా అతడి నుండి సిరి దూరం అవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఆమె కొడుకు ను కూడా పెంచుకుంటుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అతడి ఫొటోలను కూడా షేర్ చేయడం లేదు.
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
This website uses cookies.