
Bollywood bada maker Karan Johar made a huge sketch with our Pan Indian Stars
Karan Johar : బాహుబలి సిరీస్, సాహో, రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్, పుష్ప పార్ట్ 1, కేజీఎఫ్ 2 చిత్రాలతో మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 ఏకంగా రూ.1000 కోట్ల మార్కెట్‌ను టచ్ చేసి బాలీవుడ్‌నే షేక్ చేశాయి. దాంతో బాలీవుడ్ మేకర్స్ కన్ను ఇప్పుడు మన సౌత్ సినిమాలపై పడింది. మన టాలీవుడ్‌లో పాన్ ఇండియన్ స్టార్స్‌గా వెలుగుతున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్.టి.ఆర్‌లతో హిందీ నిర్మాతలు అక్కడ స్ట్రైట్ సినిమాలను నిర్మించేందుకు ప్లాన్స్ వేస్తున్నారు.
అయితే, బాలీవుడ్ బడా మేకర్ కరణ్ జోహార్ హిందీలో ‘కాఫీ విత్ కరణ్’ అనే రియాలిటీ షోను నిర్వహిస్తున్నారు. ఆ షోకు ఆయనే హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతీ తెలిసిందే. ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా 6 సీజన్స్ కంప్లీట్ చేసుకుందీ ఈ రియాలిటీ షో. అయితే, కరణ్ ఇటీవలే ఈ సక్సెస్ ఫుల్ షోను నిలిపివేస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి షాకిచ్చారు. అది చూసి ఫ్యాన్స్ ఎంతగా ఫీలయ్యారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ, మళ్ళీ ఇదే ‘కాఫీ విత్ కరణ్’ సీజన్ సరికొత్తగా మీ ముందుకు రాబోతుందని సర్‌రైజ్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
Bollywood bada maker Karan Johar made a huge sketch with our Pan Indian Stars
ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే ఈసారి సీజన్ 7 మొత్తం మన సౌత్ స్టార్స్ మరీ ముఖ్యంగా మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ హీరోలు, హీరోయిన్లతో చేసేందుకు కరణ్ పెద్ద స్కెచ్ వేశారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కరణ్ జోహార్ మన తెలుగు హీరోలతో మంచి క్లోజ్‌నెస్ మేయింటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాన్ ఇండియన్ స్టార్స్ ప్రభాస్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లతో ఓ ఎపిసోడ్‌ను, సమంత – రష్మిక మందన్నలతో ఓ ఎపిసోడ్, రామ్ చరణ్ – ఎన్.టి.ఆర్‌లతో కలిసి ఓ ఎపిసోడ్, సౌత్ స్టార్ కపుల్ నయనతార – విఘ్నేష్ శివన్‌లతో మరో ఎపిసోడ్‌ను కరణ్ జోహార్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే నిజమైతే మన స్టార్స్‌కున్న క్రేజ్‌ను కరణ్ తన షోకోసం బాగానే వాడుకుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.